కోలీవుడ్ స్టార్ హీరోల్లో విశాల్( Vishal ) ఒకరు.యాక్షన్ హీరోగా ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విశాల్ తెలుగువాడైన కూడా కోలీవుడ్ లో హీరోగా రాణిస్తూ వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.
విశాల్ కు టాలీవుడ్ లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఎందుకంటే ఈయన సినిమాలు తెలుగులో కూడా మంచి విజయాలు సాధిస్తుంటాయి.
ఇక్కడ కూడా విశాల్ చాలా సినిమాలు మంచి విజయాలు సాధించాయి.అయితే వరస హిట్స్ తో కేరీర్ లో జెట్ స్పీడ్ గా దూసుకు పోయే విశాల్ కు ఈ మధ్య సరైన హిట్ పడడం లేదు.

ఇటీవలే ఈ యాక్షన్ హీరో నటించిన ”మార్క్ ఆంటోనీ”( Mark Antony ) సినిమాతో వచ్చి హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తర్వాత విశాల్ మాస్ సినిమాల డైరెక్టర్ హరి( Director Hari )తో నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.విశాల్ కెరీర్ కు రెండు సూపర్ హిట్స్ అందించిన డైరెక్టర్ హరితో మూడవ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా విశాల్ కెరీర్ లో 34వ సినిమా( Vishal 34 )గా తెరకెక్కుతుంది.
హ్యాట్రిక్ కలయికలో మరోసారి హరితో సినిమా అనౌన్స్ చేయడంతో కోలీవుడ్ లో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.ఇక ఈ సినిమా నుండి తాజాగా ఒక అప్డేట్ తెలుస్తుంది.
ఈ సినిమాలో కీలక పాత్రల్లో కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్( Gautham Vasudev Menon ), సముద్రఖని( Samuthirakani ) నటిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో ఇప్పుడు మరో డైరెక్టర్ కూడా నటించనున్నట్టు టాక్ వినిపిస్తుంది.
ఆయన ఎవరో తెలియాల్సి ఉంది.కాగా ఈ సినిమాకు మాస్ మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్( Devi Sri Prasad ) వర్క్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసారు.
ఇక ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ రొమాంటిక్ మాస్ ఎంటర్టైనర్ ను స్టోన్ బెంచర్స్ మరియు జీ స్టూడియోస్ సౌత్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు.







