పార్టీ అభ్యర్థుల ప్రకటనలో జోరు చూపించిన కేసీఆర్( CM KCR ) దానికి తగినట్టే మేనిఫెస్టోను కూడా ప్రతిపక్షాలు ఊహించనంత వేగంగా 45 రోజులు ముందే రిలీజ్ చేసే షాక్ ఇచ్చారు .అంతేకాకుండా ఒక రకంగా మేనిఫెస్టో ద్వారా వరాల జల్లు కురిపించారనే చెప్పవచ్చు.
ముఖ్యంగా కాంగ్రెస్ బజాపా లు తమ వైన కీలక హామీలతో తెలంగాణ ప్రజానీకాన్ని ఆకట్టుకోవడం గమనించిన కేసీఆర్ తమ మేనిఫెస్టో ద్వారా వారిని తోసిరాజనే స్థాయిలో హామీలనుగుప్పించారు .ముఖ్యంగా కాంగ్రెస్ తమ ప్రధాన అస్త్రాలుగా భావిస్తున్న చాలా హామీలను కేసీఆర్ ఒక్కసారిగా ఓవర్టేక్ చేశారు.ముఖ్యంగా ఆసరా పింఛన్ అయిదు వేలకు పెంపు, దివ్యాంగుల పెన్షన్ 6000కు పెంచడం అన్నది కాంగ్రెస్ హామీలను బీట్ చేసేందుకే అన్నది బహిరంగ రహస్యం .అంతేకాకుండా అర్హులైన పేదలకు 400 కే గ్యాస్ సిలిండర్ అన్నది కూడా భాజపా ట్రేడ్ మార్క్ హామీ .

దానిని కూడా కేసీఆర్ సొంతం చేసుకున్నారు .ఇంకా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఎల్ఐసి ద్వారా జీవిత బీమా ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షలకు పెంచడం, అర్హులైన పేదలతో పాటు జర్నలిస్టులను కూడా 400 గ్యాస్ సిలిండర్( LPG Cylinder ), రైతుబంధు సాయాన్ని 16 వేలకు పెంచడం, పవర్ పాలసీ అగ్రికల్చరల్ పాలసీలను కంటిన్యూ చేయడం, మహిళా సంఘాలకు స్వంత భవనాలు, అనాధల కోసం ప్రత్యేక పాలసీలు , ప్రభుత్వ ఉద్యోగుల ఓపిసి కోసం కమిటీ ఏర్పాటు ఏర్పాటు , రైతుబంధు ,దళిత బంధు( Rythu Bandhu ) కొనసాగింపు, అన్నపూర్ణ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సన్న బియ్యం అందజేత ఇలా దాదాపు సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా బారాస ఎన్నికల హామీను తీసుకువచ్చింది.

అంతేకాకుండా అధికారం లోకి వచ్చిన ఆరు నెలల లోపు ఈ హామీలను అమలు చేసే విధంగా డెడ్లైన్ కూడా పెట్టడంతో ఇప్పుడు బారతీయ రాష్ట్ర సమితి ప్రతిపక్షాల తో మైండ్ గేమ్ మొదలెట్టినట్టే తెలుస్తుంది.ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇచ్చే హామీలు కచ్చితంగా అధికార పార్టీ కన్నా ప్రజలపై పెద్దగా ప్రభావం చూపించే అవకాశాలు లేదన్న చర్చ జరుగుతుంది.ఏది ఏమైనా తాను ఎందుకు రాజకీయ చాణిక్యుడో ఈ మేనిఫెస్టో ద్వారా మరోసారి కేసీఆర్ నిరూపించుకున్నట్లయ్యింది .







