నందమూరి బాలకృష్ణ( Balakrishna ) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి సినిమా( Bhagavanth kesari విడుదలకు సిద్ధం అయింది.రికార్డ్ స్థాయి వసూళ్లు టార్గెట్ గా ఈ సినిమా ను విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు.
దసరా కానుకగా ఈ వారంలో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా లో బ్యాక్ టు బ్యాక్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఆకట్టుకునే చక్కని పాటలు ఉంటాయని మేకర్స్ అంటున్నారు.అయితే ఈ సినిమా పాటల విషయం లో కొత్త ట్రెండ్ ని ఫాలో అవ్వబోతున్నారు.
సినిమాలో ఉన్న పాటల్లో మూడు పాటలను ఇంకా జనాల ముందుకు తీసుకు రాలేదు.ఆ మూడు పాటలను ఒకొక్కటి చొప్పున సినిమా విడుదల అయిన తర్వాత యాడ్ చేస్తారాట.

ఆ మూడు పాటల్లో ఒకటి దంచవే మేనత్త కూతుర రీమిక్స్ అనే వార్తలు వస్తున్నాయి.మొత్తానికి భగవంత్ కేసరి పాటలను విడుదల తర్వాత ప్రేక్షకులు, అభిమానులు ఎంజాయ్ చేయబోతున్నారు.ఈ మధ్య లో యాడింగ్ ఐడియా థమన్( Thaman ) దే అయ్యి ఉంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఐడియా ఎవరిది అయినా కూడా సినిమా విడుదల అయిన తర్వాత పాటలను యాడ్ చేయడం అనేది కచ్చితంగా పబ్లిసిటీ పరంగా కలిసి వస్తుంది.
దసరా రోజున దంచవే మేనత్త కూతురా పాటను విడుదల చేయబోతున్నారట.

ఆ రోజు థియేటర్ల లో ఆ పాట సంచలనం సృష్టిస్తుందని ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.రికార్డు స్థాయి వసూళ్ల ను దక్కించుకోవడం లో ఇలాంటి మార్కెటింగ్ ట్రిక్స్ ఉపయోగపడుతాయి.ఇలా పాటలను మధ్య లో యాడ్ చేయడం ద్వారా రిపీట్ ఆడియన్స్ కి చాలా ఆవకాశం ఉంటుంది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.
ప్రస్తుతం ఈ విషయమై సినీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో ప్రధానంగా చర్చ జరుగుతోంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న భగవంత్ కేసరి సినిమా యొక్క పాటలతో థమన్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాను అంటున్నాడు.







