ఖమ్మం జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ నేతల చేరికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది.ఈ మేరకు బీఆర్ఎస్ అసంతృప్త కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు ఆ పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందుకోసం ఖమ్మం జిల్లాలో కీలక నేతలుగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రంగంలోకి దిగారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే తాజాగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ బాలసాని నివాసానికి తుమ్మల, పొంగులేటి వెళ్లారు.
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని బాలసానిని ఆహ్వానించారు.అనంతరం నేతలిద్దరూ బీఆర్ఎస్ కార్పొరేటర్ కమర్తపు మురళిని కలవనున్నారని తెలుస్తోంది.
అయితే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కమర్తపు మురళీ ప్రధాన అనుచరుడిగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో టార్గెట్ అజయ్ కుమార్ గా తుమ్మల, పొంగులేటి పని చేస్తున్నారని సమాచారం.