అమెరికాలో ఘనంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ .. భారీగా తరలివచ్చిన ప్రవాస భారతీయులు

అమెరికాలో నిర్మితమైన భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్( Dr BR Ambedkar ) విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది.‘‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’’( Statue of Equality ) పేరుతో మేరీలాండ్‌లో దాదాపు 19 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

 Tallest Statue Of Ambedkar Outside India Unveiled In Us Details, Tallest Statue-TeluguStop.com

అకోకీక్ నగరంలో 13 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ (ఏఐసీ)లో భాగంగా ఈ విగ్రహాన్ని నెలకొల్పారు.విగ్రహావిష్కరణ సందర్భంగా ఆ ప్రాంతమంతా ‘‘జై భీమ్’’ నినాదాలు మారుమోగాయి.

పీటీఐ వార్తాసంస్థ నివేదిక ప్రకారం.ఈ కార్యక్రమానికి అమెరికాలోని పలు ప్రాంతాల నుంచి 500 మందికి పైగా ఎన్ఆర్ఐలు, భారత్‌లోని పలు ప్రాంతాలకు చెందిన వారు హాజరయ్యారు.

గుజరాత్‌లోని సర్ధార్ పటేల్ విగ్రహాన్ని రూపొందించిన రామ్ సుతార్( Ram Sutar ) ఈ విగ్రహాన్ని డిజైన్ చేయడం విశేషం.అంబేద్కర్ బోధనలు, సిద్ధాంతాలను వ్యాప్తి చేసే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాకులు తెలిపారు.

స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సమానత్వం, మానవహక్కుల చిహ్నంగానూ నిలుస్తుందని వారు ఆకాంక్షించారు.

Telugu Drbr, Dr Br Ambedkar, India, Jai Bheem, Maryland, Ram Sutar, Statue Equal

అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ (ఏఐసీ) అధ్యక్షుడు రామ్ కుమార్( Ram Kumar ) మీడియాతో మాట్లాడుతూ.దీనిని తాము స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీగా పిలుస్తున్నామన్నారు.అసమానత అనేది భారతదేశ సమస్య మాత్రమే కాదని.ఇది ప్రతి చోటా వివిధ రూపాల్లో ఉనికిలో వుందన్నారు.యూఎస్‌లో( USA ) అంబేద్కరైట్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న న్యూయార్క్‌కు చెందిన దీలిప్ మాస్కే మాట్లాడుతూ.స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ 1.4 బిలియన్ల మంది భారతీయులకు 4.5 మిలియన్ల భారతీయ అమెరికన్లకు ప్రాతినిథ్యం వహిస్తుందన్నారు.

Telugu Drbr, Dr Br Ambedkar, India, Jai Bheem, Maryland, Ram Sutar, Statue Equal

విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ,( PM Modi ) విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్( S Jaishankar ) నుంచి తమను అభినందిస్తూ సందేశాలు వచ్చాయని దీలిప్ పేర్కొన్నారు.ఈ విగ్రహం అమెరికాలో నివసిస్తున్న మిలియన్ల మంది భారతీయులకు మాత్రమే కాకుండా ఇక్కడి నల్లజాతీయులు, హిస్పానిక్‌లు, ఇతరులు సహా అన్ని వర్గాలకు స్పూర్తినిస్తుందన్నారు.భారతీయ అమెరికన్ డయాస్పోరాను ఏకం చేయడానికి, ఇండియాను సూపర్ పవర్‌గా మార్చడానికి ఇది ఒక చారిత్రాత్మక అడుగుగా దిలీప్ అభివర్ణించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube