విక్రమార్కుడు సీక్వెల్ పై స్పందించిన రవితేజ... ఉనట్టా... లేనట్టా?

మాస్ మహారాజ రవితేజ (Raviteja) ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswararao) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20వ తేదీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 Raviteja React On Vikramarkudu Sequel Movie Details, Raviteja,tiger Nageswararao-TeluguStop.com

రవితేజ నటించిన ఈ సినిమా మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో రవితేజ ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టి అక్కడే ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

Telugu Brahmanandam, Rajamouli, Raviteja, Vikramarkudu-Movie

ఈ క్రమంలోనే రవితేజ బాలీవుడ్ ఇండస్ట్రీలో మీడియా సమావేశంలో పాల్గొంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.రవితేజ బయోపిక్ సినిమా గురించి కూడా పలు విషయాలను వెల్లడించారు.అయితే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రవితేజ తదుపరి సినిమాల గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి.తాను తదుపరి ఒక కామెడీ సినిమా( Comedy Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని ఇందులో హాస్యబ్రహ్మం బ్రహ్మానందం( Brahmanandam ) కూడా నటించబోతున్నారని వెల్లడించారు.

ఈ సినిమా తర్వాత మరో సైన్స్ ఫిక్షన్ మూవీ కూడా చేస్తున్నట్లు ఈయన వెల్లడించారు.

Telugu Brahmanandam, Rajamouli, Raviteja, Vikramarkudu-Movie

ఇకపోతే రవితేజ రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం విక్రమార్కుడు( Vikramarkudu ) ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.ఇప్పటికి ఈ సినిమా ప్రసారమైన కళ్ళార్పకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారు అంతగా ఈ సినిమా సక్సెస్ అయింది.విక్రమార్కుడు సినిమా సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం ఉంటుందా అన్న ప్రశ్న రవితేజకు ఈ ఇంటర్వ్యూలో ఎదురయింది.

ఈ ప్రశ్నకు రవితేజ సమాధానం చెబుతూ విక్రమార్కుడు సినిమా సీక్వెల్ గురించి ఇప్పటివరకు రాజమౌళి నా దగ్గర కానీ ఎక్కడ కానీ ప్రస్తావించలేదు.రాజమౌళి గారితో కలిసి పని చేయడానికి తాను ఎప్పటికీ సిద్ధంగానే ఉంటానని ఈ సందర్భంగా రవితేజ విక్రమార్కుడు సినిమా సీక్వెల్ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube