విక్రమార్కుడు సీక్వెల్ పై స్పందించిన రవితేజ… ఉనట్టా… లేనట్టా?
TeluguStop.com
మాస్ మహారాజ రవితేజ (Raviteja) ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswararao) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20వ తేదీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
రవితేజ నటించిన ఈ సినిమా మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో రవితేజ ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టి అక్కడే ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.
"""/" /
ఈ క్రమంలోనే రవితేజ బాలీవుడ్ ఇండస్ట్రీలో మీడియా సమావేశంలో పాల్గొంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
రవితేజ బయోపిక్ సినిమా గురించి కూడా పలు విషయాలను వెల్లడించారు.అయితే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రవితేజ తదుపరి సినిమాల గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి.
తాను తదుపరి ఒక కామెడీ సినిమా( Comedy Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని ఇందులో హాస్యబ్రహ్మం బ్రహ్మానందం( Brahmanandam ) కూడా నటించబోతున్నారని వెల్లడించారు.
ఈ సినిమా తర్వాత మరో సైన్స్ ఫిక్షన్ మూవీ కూడా చేస్తున్నట్లు ఈయన వెల్లడించారు.
"""/" /
ఇకపోతే రవితేజ రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం విక్రమార్కుడు( Vikramarkudu ) ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.
ఇప్పటికి ఈ సినిమా ప్రసారమైన కళ్ళార్పకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారు అంతగా ఈ సినిమా సక్సెస్ అయింది.
విక్రమార్కుడు సినిమా సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం ఉంటుందా అన్న ప్రశ్న రవితేజకు ఈ ఇంటర్వ్యూలో ఎదురయింది.
ఈ ప్రశ్నకు రవితేజ సమాధానం చెబుతూ విక్రమార్కుడు సినిమా సీక్వెల్ గురించి ఇప్పటివరకు రాజమౌళి నా దగ్గర కానీ ఎక్కడ కానీ ప్రస్తావించలేదు.
రాజమౌళి గారితో కలిసి పని చేయడానికి తాను ఎప్పటికీ సిద్ధంగానే ఉంటానని ఈ సందర్భంగా రవితేజ విక్రమార్కుడు సినిమా సీక్వెల్ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 7, సోమవారం 2025