సూపర్ స్టార్ కృష్ణ( Krishna )వారసుడిగా మహేష్ బాబు ( Mahesh Babu ) బాల నటుడి గానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఇలా బాల నటుడిగా ఎన్నో సినిమాలలో నటించినటువంటి ఈయన అనంతరం హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు .
కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మహేష్ బాబు ప్రస్తుతం సూపర్ స్టార్ అనే బిరుదుతో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ ఎంతో మెసేజ్ ఉన్నటువంటి సినిమాల ద్వారా మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
మహేష్ బాబు నటించిన మహర్షి శ్రీమంతుడు భరత్ అనే నేను ( Bharat Ane Nenu )వంటి సినిమాల ద్వారా ఎంతో మంది స్ఫూర్తి పొంది ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్న విషయం మనకు తెలిసిందే.ఇక మహేష్ బాబు కూడా కొన్ని గ్రామాలను దత్తత కూడా తీసుకున్నారు.
ఇలా మహేష్ బాబు సినిమాలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే మహేష్ బాబుకి కూడా విపరీతమైనటువంటి ఫాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
ఇక మహేష్ బాబు సినిమాలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ ( KTR )కూడా పెద్ద అభిమాని అంటూ గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన తెలియజేశారు.ఇలా మహేష్ బాబు కేటీఆర్ ఇద్దరు కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ విధంగా మహేష్ బాబుతో కలిసి కేటీఆర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.కేటీఆర్ గారు తరచూ తన సినిమాలను చూస్తూ ఉంటారని అలాగే తన సినిమాలకు ఆయన రివ్యూ కూడా ఇస్తూ ఉంటారని తెలిపారు.సినిమా బాగుందంటే బాగుందని చెబుతారు బాగా లేకపోతే నిర్మొహమాటంగా సినిమా బాగాలేదని తన అభిప్రాయాలను తెలియజేస్తారని మహేష్ బాబు వెల్లడించారు.తాను ఆగడు సినిమా చేసిన సమయంలో ఆగడు సినిమా గురించి కేటీఆర్ గారు రివ్యూ ఇస్తున్న అభిప్రాయాన్ని తెలియజేశారని మహేష్ బాబు చెప్పబోతూ ఉండగా కేటీఆర్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

మహేష్ బాబు ఆగడు సినిమా( Aagadu )లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు.అయితే ఈ సినిమాలో మహేష్ బాబు నటన కాస్త ఎక్సైట్మెంట్ గానే ఉంటుంది అయితే ఇది కాస్త అభిమానులకు మింగుడు పడలేద.దీంతో ఈ సినిమా కూడా కలెక్షన్ల పరంగా పెద్దగా సక్సెస్ అందుకోలేక పోయిందని చెప్పాలి.

ఇక ఈ సినిమా చూసినటువంటి కేటీఆర్ తన అభిప్రాయాలను తెలియజేస్తూ స్టాప్ డూయింగ్ లైక్ దిస్ నాన్సెన్స్ అంటూ చెప్పారు ఇప్పటికీ నాకు ఆ విషయం గుర్తు వుందని మహేష్ బాబు తెలియచేశారు.అందుకే నేను చేసే సినిమాలు కేటీఆర్ గారు చూస్తున్నారు అంటే నాకు చాలా టెన్షన్ గా ఉంటుంది అంటూ మహేష్ బాబు ఈ సందర్భంగా చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







