బిగ్ బాస్ (Bigg Boss) సీజన్ సెవెన్ కార్యక్రమం ఐదు వారాలను పూర్తిచేసుకుని ఆరో వారం కూడా పూర్తి కాబోతుంది.ఇప్పటికే ఈ హౌస్ నుంచి అయిదుగురు కంటెస్టెంట్ లో బయటకు వెళ్ళగా గతవారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరో ఐదుగురు కంటెస్టెంట్ లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా వైల్డ్ కార్డు ద్వారా బిగ్బాస్ హౌస్లోకి అడుగు పెట్టినటువంటి వారిలో కంటెస్టెంట్ అర్జున్ అంబటి(Arjun Ambati) ఒకరు.ఈయన ఎన్నో బుల్లితెర సీరియల్స్ లో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇలా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి అర్జున్ బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లారు.అయితే తాజాగా ఈయనకు సంబంధించి ఒక వార్త వైరల్ గామారింది.

ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ అర్జున్ పుష్ప (Pushpa) సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు అయితే ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.పుష్ప సినిమాలో తాను కూడా ఆడిషన్స్ కి వెళ్ళానని తెలిపారు.లోపలికి వెళ్ళగానే అక్కడ సుకుమార్ (Sukumar) గారు ఉన్నారని,తనని చూడగానే నాకు కాస్త భయం వేసిందని తెలిపారు.అయితే ఆయన మాట్లాడుతూ ఏంటి సీరియల్ అయిపోయిందా అని అడిగారు.
ఇలా నేను నటించే సీరియల్స్ గురించి సుకుమార్ సార్ గారు అడగడం తనకు ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు.ఇక తాను కూడా ఆడిషన్స్ లో పాల్గొన్నానని తెలిపారు.
కానీ ఈ సినిమాలో నన్ను సెలెక్ట్ చేయలేదని అర్జున్ తెలిపారు.

ఈ సినిమాలో నన్ను సెలెక్ట్ చేయకపోవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు సుకుమార్ గారు ఏదైనా ఒక పాత్ర కోసం ఆడిషన్స్ చేస్తున్నారు అంటే అన్ని విధాలుగా ఆ పాత్రకు సరిపోతారు అనిపిస్తేనే సెలెక్ట్ చేస్తారు.ఒకటి లుక్స్ పరంగా కావచ్చు మరొకటి వారి బాడీ లాంగ్వేజ్ అయినా కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయం గురించి కూడా బాగా ఆలోచించే వారిని సెలెక్ట్ చేస్తారు బహుశా నేను కూడా ఆయన సెలెక్ట్ చేసినటువంటి పాత్రకు లుక్ పరంగా సరిపోలేదేమో అందుకే నన్ను ఈ సినిమా నుంచి రిజెక్ట్ చేశారు అంటూ ఈ సందర్భంగా అర్జున్ అంబటి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







