టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్క్ బ్యూటీగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి నటి తమన్నా (Tamannah) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికీ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఒకప్పుడు సినిమాలలో మాత్రమే నటించే తమన్న ప్రస్తుతం వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు.అయితే ఈ వెబ్ సిరీస్లలో నటించే సమయంలో ఈమె కాస్త గ్లామర్ షో చేయడమే కాకుండా రొమాంటిక్ సన్నివేశాలలో కూడా నటిస్తూ భారీ స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నారు.
ఇలా తన వ్యక్తిగత కారణాలవల్ల తమన్న ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు.

ఇక ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ( Vijay Varma) ప్రేమలో పడటం వీరి ప్రేమ పెళ్లి గురించి కూడా ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.ఇకపోతే తాజాగా ఒక నెటిజన్ తమన్నాను ఉద్దేశిస్తూ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే ఆ నేటిజన్ అడిగినటువంటి ప్రశ్నకు తమన్నా సమాధానం చెబుతూ చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి.
ఈ సందర్భంగా నేటిజన్ తమన్నాని ప్రశ్నిస్తూ ఈమధ్య సినిమా అవకాశాలు లేకపోవడం వల్లే ఇలా గ్లామర్ షో చేస్తున్నావా అంటూ తమన్నాని ప్రశ్నించారు ఈ ప్రశ్నకు ఈమె తన స్టైల్ లోనే సమాధానం చెప్పారు.

నేటిజన్ ప్రశ్నకు స్పందించినటువంటి తమన్న నాకు సినిమా అవకాశాలు లేవని నీకు ఎవరు చెప్పారు గతంలో కంటే తాను ఇప్పుడే చాలా బిజీగా ఉన్నానని ఈమె తెలిపారు.ప్రస్తుతం రోజుకు నేను 18 గంటల పాటు పని చేస్తున్నానని తమన్నా వెల్లడించారు.ఇక సినిమాలపరంగా గ్లామర్ షో విషయంలో నా హద్దులు నాకు ఉంటాయి.
ఏ ప్రాంతాన్ని బట్టి అందుకు అనుకూలంగా దుస్తులు నేను ధరిస్తాను.ఇక తాను ఒక సినిమాకు కమిట్ అయ్యే ముందు ఆ సినిమా గురించి బాగా ఆలోచించి నాకు నచ్చితేనే చేస్తాడు ఒకవేళ కమిట్ అయ్యాను అంటే 100% న్యాయం చేస్తాను.
ఇలా అరకొర తెలివితేటలను ప్రదర్శిస్తూ ఇంకొకసారి ఇలాంటి ప్రశ్నలు అడగద్దు అంటూ ఈమె సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.







