Hemalatha Lavanam : రవితేజ మూవీలో రేణు పోషించిన పాత్ర హేమలత లవణం గొప్పదనం గురించి ఈ విషయాలు తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) మాజీ భార్య రేణు దేశాయ్ ( Renu Desai ) జానీ సినిమా తర్వాత మొదటిసారి ప్రేక్షకుల ముందుకు తిరిగి రాబోతున్నారు.ఈమె రవితేజ(Ravi Teja) హీరోగా నటించినటువంటి టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswararao ) సినిమాలో హేమలత లవణం ( Hemalatha Lavanam ) అనే పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

 Renu Desai Role Play In Ravi Teja Tiger Nageshwara Rao Movie-TeluguStop.com

ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20వ తేదీ విడుదల కానుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం కూడా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నటిస్తున్నారని తెలియడంతో ఆమె నటిస్తున్నటువంటి ఈ హేమలత లవణం ఎవరు ఆమె గొప్పతనం ఏంటి అనే విషయాల గురించి ఆరా తీస్తున్నారు.

Telugu Pawan Kalyan, Ravi Teja, Renu Desai, Tigernageshwara-Movie

టైగర్ నాగేశ్వరరావు సినిమా స్టువర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా తెరకెక్కించారు.ఇక ఈ సినిమాలో చాలా వరకు నిజ జీవిత కథ ఆధారంగానే కొన్ని పాత్రలను రూపొందించారు.ఈ క్రమంలోనే హేమలత లవణం పాత్ర కూడా నిజ జీవిత కథ ఆధారంగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చెప్పాలి.లెజెండరీ రచయిత ‘గుర్రం జాషువా’ కూతురే ‘హేమలత లవణం’.

ఈమె ఒక సంఘసంస్కర్త, అలాగే తండ్రిలా ఒక రచయిత.ఈమె జాతి వివక్షత అంటరానితనం వంటి వాటిపై కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు.

Telugu Pawan Kalyan, Ravi Teja, Renu Desai, Tigernageshwara-Movie

19వ కాలంలో తన భర్తతో కలిసి హేమలత.నేరాలకు పాల్పడే నేరస్థుల్లో పరివర్తన తీసుకు వచ్చేందుకు ఎంతో శ్రమించారు.ఈక్రమంలోనే స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావుని కూడా ఆమె కలుసుకున్నారని ఈ సన్నివేశాలను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తోంది.ఇలా ఈ సినిమా ద్వారా రేణు దేశాయ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈమె పాత్ర పై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి.

మరి టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా రవితేజ ఎలాంటి సక్సెస్ అందుకుంటారు హేమలత లవణం పాత్రలో నటించిన రేణు దేశాయ్ ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటారు అనే విషయం తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube