పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas )ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్( Prashanth neel ) దర్శకత్వంలో ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్.
ఈ సినిమా ఎన్నో అంచనాలు సెప్టెంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడింది.దీంతో డిసెంబర్ 22వ తేదీ విడుదలకు సిద్ధమైంది.
ఇక ప్రభాస్ సినిమా డిసెంబర్ 22వ తేదీ విడుదల కానున్నటువంటి నేపథ్యంలో అదే రోజు కూడా షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) నటించిన డంకీ ( Dunki ) సినిమా కూడా విడుదలవుతుంది.

ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద ఇద్దరు స్టార్ హీరోలు తమ సినిమాలతో పోటీపడుతున్నటువంటి నేపథ్యంలో అభిమానులు ఈ సినిమాల విషయంలో కాస్త గందరగోళం వ్యక్తం చేశారు.ఇలా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలవడంతో సినిమా కలెక్షన్ల పై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని ఆందోళన చెందారు.అయితే ప్రభాస్ సలార్ సినిమా పట్ల ఎన్నో అంచనాలు ఉండడంతోనే ఈ సినిమాని షారుక్ ఖాన్ కి పోటీగా దింపుతారు.
కానీ షారుఖ్ ఖాన్ సినిమా మాత్రం డిసెంబర్ 22 నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా వాయిదా పడటంతో ప్రభాస్ సినిమా సోలోగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

డిసెంబర్ 22వ తేదీ ప్రభాస్ సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక మూడు వారాలపాటు ఈ సినిమాకు ఎలాంటి సినిమాలు అడ్డు లేకపోవడంతో భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబడతాయని ప్రభాస్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక ప్రభాస్ కెరియర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా కూడా సినిమా నిలుస్తుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైనా షారుఖ్ ఖాన్ డంకీ సినిమా వాయిదా పడటంతో ప్రభాస్ అభిమానులు ప్రభాస్ దెబ్బకు షారుక్ ఖాన్ భయపడ్డారని ఇక ఎవరు పోటీకి వచ్చే అవకాశమే లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.







