ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y.S Jagan Mohan Reddy) ఏ పార్టీ కార్యక్రమానికి వెళ్లినా కూడా అక్కడ ప్రతిపక్ష నేతలను విమర్శిస్తూ కామెంట్స్ చేస్తుంటారు.ఈ క్రమంలోనే నిన్న కాకినాడలో జరిగిన బహిరంగ సభలో భాగంగా ఈయన ఒకవైపు తెలుగుదేశం పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు గురించి అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడారు.ఇక జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) వ్యక్తిగత జీవితం గురించి విమర్శలు చేస్తుంటారనే విషయం మనకు తెలిసిందే.
తాజాగా కూడా ఈయన పవన్ కళ్యాణ్ పట్ల విమర్శలు చేశారు.ఒకరికి ఏమో ఇల్లు హైదరాబాద్లో ఉంటుంది.ఒక ఇల్లాలు ఏమో లోకల్ మరొక ఇల్లాలేమో నేషనల్, మరొకరి ఇంటర్నేషనల్ అంటూ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు.
ఈ విధంగా పవన్ కళ్యాణ్ గురించి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై బండ్ల గణేష్ ( Bandla Ganesh ) స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.
ఇందులో భాగంగా ఉన్నత హోదాలో ఉన్నటువంటి మీరు ఇలా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం ఏమాత్రం సరి కాదు అంటూ ఈయన ఒక వీడియోని విడుదల చేశారు.పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంచి మనసున్న వ్యక్తి ఆయన తన కంఫర్ట్ జోన్ వదులుకొని ప్రజల కోసం రాత్రి పగలు కష్టపడి పని చేస్తున్నారు.
నాకెంతో ఇష్టమైన దైవ సమానుడైనటువంటి పవన్ కళ్యాణ్ గురించి జగన్మోహన్ రెడ్డి అభ్యంతరకర మాటలు మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ ఎంతో మంచి మనసున్న వ్యక్తి ప్రతి ఒక్కరి జీవితంలోను ఏవో ఒక చెడు జరుగుతుంది అలాగే పవన్ కళ్యాణ్ విషయంలో కూడా తన ప్రమేయం లేకుండా చెడు జరిగింది.ఇదే విషయాన్ని కొందరు తనని టార్గెట్ చేస్తూ మాట్లాడటం మంచిది కాదని తెలిపారు.ఇక జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల గురించి విమర్శలు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ చేసే మంచి పనులు ఆయన చేసే ఆలోచనలలో నీతి నిజాయితీ ఉంటుందని బండ్ల గణేష్ తెలిపారు.

పవన్ కళ్యాణ్ సినిమాలలో రాత్రి పగలు కష్టపడుతూ వచ్చిన డబ్బుతో పార్టీని నడిపిస్తున్నారని ఆయన ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే వారిని ఆదుకోవడానికి ముందుకు వస్తారని బండ్ల గణేష్ తెలిపారు.ఆయన ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకుండా పార్టీని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు.ఆయనకు లేనిది కులాభిమానం ఒక్కటేనని ఆయన మనమంతా భారతీయులమనే చెబుతారు అంటూ బండ్ల గణేష్ తెలిపారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి కులాభిమానమే ఉంటే ఈరోజు నేను ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు అంటూ బండ్ల గణేష్ తెలిపారు.
ఈరోజు నేను ఈ స్టేటస్ అనుభవిస్తున్నాను అంటే అందుకు కారణం పవన్ కళ్యాణ్ పెట్టిన భిక్ష అని ఈయన తెలిపారు.ఇలాంటి గొప్ప మహానుభావుడి పై అబాండాలు వేయకండి ఇలాంటి సమయంలో కూడా నేను మాట్లాడకపోతే నా బ్రతుకు ఎందుకు అనిపించింది అందుకే ఇలా మాట్లాడాను అంటూ బండ్ల గణేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







