World Cup 23: 2008లో అండర్-19 ఆడి, 2023 వరల్డ్ కప్ ఆడుతున్న ఆటగాళ్ల లిస్ట్ ఇదే!

కాలం చాలా గొప్పది.2008లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో సత్తా చాటిన కొంతమంది ఆటగాళ్లు 2023లో భారత్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌లో పాల్గొంటున్నారమే విషయం మీకు తెలిసిందా? 2008 అండర్-19 ప్రపంచకప్‌లో మెరిసిన తర్వాతే విరాట్ కోహ్లి టీమిండియాలోకి రావడం జరిగింది.కాగా ఈసారి కోహ్లీ మూడో ప్రపంచకప్‌ ఆడుతుండడం విశేషం.ఈ ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో విరాట్ రెండు అర్ధ సెంచరీలు సాధించి శెభాస్ అనిపించుకున్నాడు.అదేవిధంగా ఆస్ట్రేలియా ఆటగాడు “స్టీవ్ స్మిత్” 2008 అండర్-19 ప్రపంచకప్ కూడా ఆడాడు.ప్రస్తుతం అతను మూడో ప్రపంచకప్‌ ఆడుతున్నాడు.

 World Cup 23 This Is The List Of Players Who Played Under 19 In 2008 And Are Pl-TeluguStop.com

ఇక ఈ జాబితాలో న్యూజిలాండ్‌ ఆటగాడు “కేన్‌ విలియమ్సన్‌” కూడా ఉన్నాడు.కోహ్లి, స్టీవ్ స్మిత్‌( Virat kohli )లతో పోటీ పడుతున్న విలియమ్సన్ ప్రస్తుతం గాయపడినప్పటికీ… న్యూజిలాండ్ ప్రపంచ కప్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.టీమ్ ఇండియా స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా( Ravindra Jadeja ) కూడా అండర్-19 ప్రపంచ కప్ 2008కి సహకారం అందించాడు.అయితే 2023 ప్రపంచకప్‌లో ఇంకా బ్యాటింగ్ చేయలేదు.

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ కూడా 2008లో అండర్-19 ప్రపంచకప్‌లో తన ఉనికిని చాటుకున్నాడు.మార్కస్ స్టోయినిస్ అద్భుతమైన ఫినిషర్‌గా పేరుగాంచాడు.ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ కూడా వున్నాడు మరి.అతను ప్రపంచ కప్ 2023 టాప్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పరిగణించబడ్డాడు.ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్(Chris Woakes ) కూడా అండర్-19 వరల్డ్ కప్ 2008లో తన ప్రతిభను కనబరిచాడు.2019 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ను ఛాంపియన్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube