ఎల్లుండి తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితా..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై తీవ్ర కసరత్తు చేస్తోంది.ఈ క్రమంలోనే ఎల్లుండి అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది.

 First List Release Day After Tomorrow Of Telangana Congress Candidates..!-TeluguStop.com

ఈ తొలి జాబితాలో దాదాపు 70 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.ఇందుకు సంబంధించి ఇవాళ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది.

ఇప్పటికే దాదాపు వంద స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ చేసిన కసరత్తు పూర్తి కాగా మిగిలిన స్థానాలకు ఇవాళ నిర్వహించే భేటీలో చర్చించనున్నారు.అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది.

ఈ క్రమంలో స్క్రీనింగ్ కమిటీ వడబోసిన జాబితా నుంచి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube