మాములుగా హీరోయిన్స్ ( Heroines )చూడటానికి చాలా అందంగా ఉంటారు.కానీ ఆ అందాన్ని మరింత అందంగా మార్చడానికి సర్జరీలు వంటివి చేయించుకుంటారు.
నిజానికి సర్జరీ చేయించుకున్న తర్వాత వాళ్ళు అంత అందంగా ఉండరు.కానీ అవకాశాల కోసం వాళ్ళు మరింత అందంగా కనిపించడానికి తమలో ఉన్న లోపాలని సరి చేయడానికి సర్జరీ వంటివి చేయించుకుంటూ ఉంటారు.
ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ ఫేస్ సర్జరీలు చేయించుకున్నారు.దీంతో వారికి చాలా ట్రోల్స్, నెగిటివ్ కామెంట్లు కూడా ఎదురయ్యాయి.
అయినా కూడా కొత్త హీరోయిన్స్ కూడా అవకాశాల కోసం అదే బాట పడుతున్నారు.అయితే తాజాగా మాధవిలత కూడా తన ఫేస్ సర్జరీ చేయించుకోకముందు ఫోటో పంచుకోగా ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.
ఇంతకు అందులో ఎలా ఉందో తెలుసుకుందాం.

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీకి చెందిన నటి మాధవిలత( Actress Madhavilatha ) అందరికీ బాగా పరిచయం.ఈమె నటిగా కంటే వ్యక్తిగతంగా బాగా హాట్ టాపిక్ గా నిలుస్తుంది.చిన్న చిన్న పాత్రలతో వెండితెరపై అడుగుపెట్టగా.
ఆ తర్వాత హీరోయిన్ గా పరిచయం అయింది.అలా తొలిసారిగా 2008లో నచ్చావులే సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.
ఆ తర్వాత స్నేహితుడు సినిమాలో నటించింది.కానీ ఆ సినిమాతో తనకు అంతగా గుర్తింపు రాలేకపోయింది.
పైగా తాను కథలు ఎంచుకోవడంలో పొరపాటు చేయడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియా వేదికగా తెలుగు ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది.
నిత్యం తన సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక పోస్టు తో బాగా హాట్ టాపిక్ గా మారుతుంది.

ఆ పోస్టుకు నెగిటివ్ కామెంట్స్ కూడా ఎదుర్కొంటుంది.పైగా తాను కూడా అవతలి వారి పై బాగా ఫైర్ అవుతుంటుంది.ఇక రాజకీయపరంగా కూడా యాక్టివ్ గా ఉంటూ జోరుగా ప్రచారాలు చేస్తూ ఉంటుంది.
అంతేకాకుండా కొన్ని కొన్ని వివాదాలు సృష్టిస్తూ ఉంటుంది.అలా చాలా విషయాలలో బాగా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది.
ఇక పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటూ సోషల్ మీడియాలో బాగా కాలక్షేపం చేస్తూ ఉంటుంది.అప్పుడప్పుడు రీల్స్ చేస్తూ అందరి దృష్టిలో పడుతుంది.
ఇక ఈమెకు ఎన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చినప్పుడు వాటిని పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు ఉంటుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేసుకుంది.
అందులో తను రెండు ఫోటోలను ఒకే ఫ్రేమ్ లో ఎడిట్ చేసి పంచుకుంది.అందులో ఒక ఫోటో ఇప్పటిది కాగా మరో ఫోటో తను సినిమాలలో చేస్తున్న సమయంలోనిది.
ఇక ఆ ఫోటోలలో తను ఇప్పటికంటే ఒకప్పుడు చాలా బాగుంది.దీంతో ఆ ఫోటో చూసిన వాళ్లంతా సర్జరీ కంటే ముందుగానే చాలా బాగున్నావు అని కామెంట్ పెట్టడంతో.
మాధవిలత కూడా సర్జరీ చేయించుకుందా అని కొందరు ఆశ్చర్యపోతున్నారు.ఇక ప్రస్తుతం సినిమాలకైతే పూర్తిగా దూరంగా ఉందని చెప్పాలి.







