రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటలో కెసిఆర్( CM KCR ) సభ ఈ నెల 17న సిరిసిల్లలో జరగనున్నందున సభకు పెద్ద ఎత్తున తరలివెల్లి విజయవంతం చేసేందుకు గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి గురువారం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వరుస కృష్ణ హరి ( Krishna Hari )మాట్లాడుతూ ఈనెల 17న సిరిసిల్లలో జరిగే కెసిఆర్ సభకు గ్రామం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని, అందుకు పార్టీ కుటుంబ సభ్యులందరూ ఉత్సాహంతో పని చేసి సభ విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్యాక్్స చైర్మన్ కృష్ణారెడ్డి( Krishna Reddy ), ఏఎంసి చైర్మన్ ఎలుసాని మోహన్, నాయకులు మల్లారెడ్డి, అందె శుభాష్, పిల్లి కిషన్, దేవరాజు, కోరుట్లపేట గ్రామ శాఖ అధ్యక్షుడు లోకుర్తి బాలమల్లు, ఎంపీటీసీ సభ్యుడు మధు, ఉపసర్పంచ్ కరుణాకర్ రావు, రైతుబంధు సమితి అధ్యక్షుడు రఘునందన్ రావు, ఏఎంసి డైరెక్టర్ ప్రతాపరెడ్డి, బాల్ రెడ్డి, దేవరాజు, సురభి కాంతారావు , గంట విశ్వనాథం, గంట రామాగౌడ్, గంట రాజం, గంట శ్రీనివాస్ గౌడ్, శివశంకర్, ప్రభాకర్, సమద్, శ్రావణ్, సాయి, శివారెడ్డి, సంతోష్, అరవింద్, లోకుర్తి రవి, ప్రశాంత్, హైమద్, తిరుపతి, దేవరాజు తదితరులు పాల్గొన్నారు.







