సమంత హీరోయిన్ గా ఇటీవలే ఖుషి మూవీ( Khushi movie ) వచ్చిన విషయం తెల్సిందే.శివ నిర్వాన దర్శకత్వం లో రూపొందిన ఖుషి మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
అంతే కాకుండా డీసెంట్ ఓపెనింగ్స్ ని దక్కించుకోవడం తో పాటు లాంగ్ రన్ లో కూడా మంచి వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే.సమంత కావాలని ఈ కథ ని శివ నిర్వాన తో చేయించింది అంటూ కొందరు ఆ మధ్య వ్యాఖ్యలు చేశారు.
నాగ చైతన్య కి తగిలే విధంగా సమంత ఈ సినిమా చేస్తోంది అన్నట్లుగా కొందరు చేసిన కామెంట్స్ కి చిత్ర యూనిట్ సభ్యులు మౌనమే సమాధానం అన్నట్లుగా ఉండి పోయారు.సినిమా విడుదల అయిన తర్వాత తేలిన విషయం ఏంటి అంటే అసలు ఈ సినిమా కు సమంత, చైతూ ఇష్యూ కి అసలు సంబంధం లేదు.
సమంత తో సినిమా చేసిన శివ నిర్వాన( Shiva Nirvana ) అంటే నాగ చైతన్య కి కోపం ఉండి ఉండవచ్చు అని కొందరు భావిస్తున్నారు.

కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం చైతూ చేస్తున్న చందు మొండేటి సినిమా( Chandu Mondeti movie ) షూటింగ్ పూర్తి అవ్వడమే ఆలస్యం శివ నిర్వాన దర్శకత్వం లో నాగ చైతన్య చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.గతంలో వీరిద్దరి కాంబోలో మజిలి వచ్చింది.ఆ సినిమాలో హీరోయిన్ గా సమంత నటించింది.
సమంత మరియు నాగ చైతన్య లను కలిపి సినిమా ను రూపొందించిన దర్శకుడు శివ నిర్వాన ఇప్పుడు విడి విడిగా ఇద్దరి తో సినిమాలు చేస్తున్నాడు.సమంత తో తీసిన ఖుషి సినిమా ఇప్పటికే విడుదల అవ్వగా ఇక నాగ చైతన్య తో సినిమా రాబోతుంది.
నాగ చైతన్య తో శివ నిర్వాన రూపొందించబోతున్న సినిమా లో హీరోయిన్ గా సమంత నటిస్తే బాగుంటుందని కొందరు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కానీ అది సాధ్యం అవ్వదు.
విడాకులు తీసుకున్న చైతూ మరియు సమంత మళ్లీ కలిసి నటిస్తారు అని ఏ ఒక్కరు అనుకోవడం లేదు.మరి చైతూ కోసం ఎవరిని శివ నిర్వాన తీసుకు వస్తాడో చూడాలి.







