నందమూరి అభిమానులతో( Nandamuri fans ) పాటు తెలుగు సినీ ప్రేమికులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధం అయింది.బాలకృష్ణ పద్దతులు, సిద్దాంతాలు ఎక్కువగా నమ్ముతూ ఉంటాడు అనే విషయం తెల్సిందే.
అందులో భాగంగానే మోక్షజ్ఞ( mokshagna ) ఎంట్రీ కోసం బ్రహ్మ ముహూర్తం ను ఖరారు చేయడం జరిగిందని వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం 2024 సంవత్సరం లో మోక్షజ్ఞ మొదటి సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది.2025 సంవత్సరం లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.మొత్తానికి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చేందుకు బాలయ్య( Balayya ) సిద్ధం అవుతున్నాడు.
ఆ మధ్య కొన్నాళ్ల పాటు మోక్షజ్ఞ పూర్తిగా కనిపించకుండా పోయాడు.కానీ ఈ మధ్య తరచు కెమెరా ముందుకు వస్తున్నాడు.

ముఖ్యంగా బాలయ్య సినిమా కార్యక్రమాలకు హాజరు అవుతూ సందడి చేస్తూ ఉన్నాడు.తాజాగా భగవంత్ కేసరి సినిమా( Bhagwant Kesari movie ) యొక్క యూనిట్ సభ్యులతో కూడా కలిసి ఫోటో దిగిన మోక్షజ్ఞ వైరల్ అయ్యాడు.మోక్షజ్ఞ ఎంట్రీ విషయం లో బాలయ్య సన్నిహితుల వద్ద చర్చలు జరుపుతున్నాడు.కొన్ని కథలను ఇప్పటికే ఎంపిక చేయడం జరిగింది.మోక్షజ్ఞ మొదటి సినిమాకు మంచి దర్శకుడి కోసం బాలయ్య వెతుకుతున్నాడు.తాను అనుకున్నట్లుగా దర్శకుడు లభించకుంటే డౌట్ లేకుండా బాలయ్య తానే మోక్షజ్ఞ సినిమా కి దర్శకత్వం వహించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
మొత్తానికి బాలయ్య మరియు మోక్షజ్ఞ కాంబో ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులో ఎప్పుడైనా ఉండే అవకాశం ఉందని నందమూరి అభిమానులు నమ్మకంగా ఉన్నారు.మోక్షజ్ఞ ను టాలీవుడ్ స్టార్ హీరోగా మల్చేందుకు బాలయ్య కాస్త ఎక్కువ బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లుగా టాక్.







