కొంతమంది చేసే పనులు కాస్త విచిత్రంగా ఉంటాయి.సునకనందం పొందడానికి చేస్తారో.
లేదంటే మరి ఏమైనా ఇతర కారణాలు ఉంటాయో తెలియదు కానీ కొందరు చేసే పనులు అవతల వ్యక్తులను చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది అనడానికి ఈ సంఘటన నిదర్శనం.ఓ యువకుడు తాను ప్రేమించిన ప్రియురాలు ఫోటోలను మార్ఫింగ్ చేయడమే కాకుండా తనకేమీ తెలియనట్లు బాధితురాలుతో కలిసి వాటి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు కాస్త లోతుగా దర్యాప్తు చేయడంతో ఫోటోలను మార్ఫింగ్ చేసింది ప్రియుడేనని తెలిసింది.దీంతో బెంగళూరు పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేశారు.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.తమిళనాడు లోని వెల్లూరుకు( Vellore in Tamil Nadu ) చెందిన సంజయ్ కుమార్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన తన చిన్ననాటి స్నేహితురాలితో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు.పదవ తరగతి నుండి వీరిద్దరికీ మంచి పరిచయం ఉంది.
ఈ ప్రేమికులు ప్రస్తుతం బెంగుళూరులో ఉంటూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారు.ఈ క్రమంలో సంజయ్( Sanjay ) స్నేహితురాలి మార్ఫింగ్ ఫోటోలు కొన్ని ఇంస్టాగ్రామ్, టెలిగ్రామ్ లాంటి సామాజిక మధ్యమాల్లో పోస్ట్ అయ్యాయి.
ఈ విషయం సంజయ్ స్నేహితురాలి దృష్టికి వచ్చింది.ఈ విషయం తన ప్రియుడైన సంజయ్ కు తెలుపగా ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముందుగా ఆ ఫోటోలన్నింటిని తొలగించాల్సిందిగా సామాజిక మధ్యమ సంస్థల ప్రతినిధులను కోరారు.అలాగే ఆ ఫోటోలు ఏ అకౌంట్ నుండి పోస్ట్ అయ్యాయి అనే వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు.ఆ సమాచారం ఆధారంగా విచారణ చేయగా ఆమె ప్రియుడు సంజయ్ కుమారే ఈ ఫోటోలను పోస్ట్ చేశాడని తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు వెంటనే సంజయ్ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నేరాన్ని అంగీకరించాడు.ఇలా ఎందుకు చేశావని ప్రశ్నించగా.
ప్రియురాలి ఫోటోలకు వచ్చే కామెంట్స్ చూసి ఆనందం పొందడానికే ఇలా చేశానని చెప్తే పోలీసులు షాక్ అయ్యారు.మరొక ఆశ్చర్యకర విషయం ఏమిటంటే సంజయ్ కుమార్ తనకు తెలిసిన బంధువుల, స్నేహితుల ఫోటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.







