బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.కేసీఆర్ సర్కార్ దోపిడీ ప్రభుత్వమన్న ఆయన ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ దోపిడీ ప్రభుత్వాన్ని వదిలించుకోవాలని ప్రజలు చూస్తున్నారని భట్టి తెలిపారు.ఈ నేపథ్యంలోనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని తెలిపారు.ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రజలు ఆలోచించి ఓటేయాలని వెల్లడించారు.
అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు నడుస్తోందన్న భట్టి విక్రమార్క వామపక్షాలతో పొత్తుపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.







