పిల్లలు చదువుకునే గదిలో ఈ వస్తువులు ఉంటే.. మీ పిల్లలు చదువులో..?

వాస్తు శాస్త్రంలో కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచడానికి కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.ఈ నియమాలను పాటించడం వల్ల మీరు సంతోషకరమైన ప్రశాంతమైన జీవితాన్ని పొందవచ్చు.

 If These Things Are In The Room Where Children Study Are Your Children Studying-TeluguStop.com

అంతేకాకుండా పిల్లలు చదువుకునే గది గురించి వాస్తు శాస్త్రంలో కొన్ని ముఖ్యమైన నియమాలను వెల్లడించారు.వాటిని సరిగా పాటించడం వల్ల మీ పిల్లలు చదువులోనే కాకుండా జీవితంలో కూడా విజయం సాధిస్తారు.

అలాంటి కొన్ని వాస్తు చిట్కాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.వాస్తు శాస్త్రం ప్రకారం పిల్లలు చదువుకునే గదిలో నీటి వ్యవస్థ ( Water system )ఎంతో ప్రధానమైనదని నిపుణులు చెబుతున్నారు.

Telugu Childrens, Vastu Shastra, Vastu Tips, System-Telugu Raasi Phalalu Astrolo

ఒక పిల్లవాడు చదువుతున్నప్పుడు తరచుగా అలసిపోతాడు.అతనికి దాహం వేస్తుంది.కాబట్టి పిల్లలు చదువుకునే గదిలో సరైన నీటి వసతి ఉండేలా చూసుకోవాలి.అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా తరచుగా నీరు తాగడం శరీరానికి ఎంతో మంచిది.చదువుకునే గదిలో నీటిని ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.పిల్లలు చదువుతున్నప్పుడు మధ్యలో లేచి పదేపదే గది నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

తద్వారా పిల్లల మనస్సు చదువుపైనే నిమగ్నమై ఉంటుంది.వాస్తు శాస్త్రం ప్రకారం పిల్లలు చదువుకునే గదిలో నీటి వ్యవస్థ కోసం ఉత్తర దిశను ఎంచుకోవడం మంచిది.

మీరు ఈ దిశలో నీటి కుజ, వాటర్ ఫిల్టర్ మొదలైనవి ఉంచవచ్చు.

Telugu Childrens, Vastu Shastra, Vastu Tips, System-Telugu Raasi Phalalu Astrolo

ఇంకా చెప్పాలంటే పిల్లలు చదువుకునే గదిలో భయంకరంగా ఉన్న చిత్రాలను ఆ గదిలో ఉంచకూడదు.అయితే కొన్ని మంచి చిత్రాలను పిల్లలు చదువుకునే గదిలో ఉంచడం వల్ల పిల్లలలో పాజిటివ్ థింకింగ్( Positive thinking ) పెరుగుతుంది.పరిగెత్తే గుర్రాలు, ఉదయిస్తున్న సూర్యుడి చిత్రాలు( Images of the sun ), చెట్లు లేదా పక్షుల చిత్రాలను పిల్లలు చదువుకునే గదిలో ఉంచవచ్చు.

అలాగే పిల్లలు చదువుకునే గదిలో పిల్లల ముఖం తూర్పు( East ) వైపున ఉండేలా చూసుకోవాలి.తూర్పుముఖంగా చదవడానికి సరైన ఏర్పాటు లేకపోతే ఈశాన్య ముఖంగా( North-east facing ) ఉండేలా చూసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube