పెద్ద మనసు చాటుకున్న ఎన్ఆర్ఐ జంట .. టెక్సాస్‌లో తొలి హిందూ క్యాంప్‌సైట్‌ కోసం రూ.14 కోట్ల విరాళం

అమెరికాలోని హ్యూస్టన్‌లో స్థిరపడిన ఎన్ఆర్ఐ జంట తన పెద్ద మనసు చాటుకుంది.టెక్సాస్‌లో( Texas ) తొలి హిందూ క్యాంప్‌సైట్ నిర్మాణానికి గాను 1.75 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 14 కోట్లు) విరాళంగా అందించారు.ఇది నిర్మాణం పూర్తయితే ప్రతి ఏడాది వేసవిలో హెరిటేజ్ యూత్ క్యాంప్‌లను నిర్వహిస్తారు.

 Indian-american Couple Donates Over 14 Crore For Texas First Hindu Campsite Deta-TeluguStop.com

విద్యను అందించే పాఠశాలలు, కళాశాలల మాదిరిగానే హిందూ హెరిటేజ్ యూత్ క్యాంపులు, లైఫ్ మౌల్డింగ్ ఎడ్యుకేషన్‌ను అందిస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు.

మెగా విరాళం అందించిన సుభాష్ గుప్తా,( Subhash Gupta ) సరోజినీ గుప్తాలు( Sarojini Gupta ) మాట్లాడుతూ.

ఈ శిబిరం రాబోయే రోజుల్లో క్లిష్టమైన విలువలు, నైపుణ్యాలను పెంపొందిస్తుందని ఆకాంక్షించారు.ఈ శిబిరం పట్ల మక్కువ చూపుతున్నామని గుప్తా దంపతులు తెలిపారు.

రాబోయే తరానికి మనం చేయగలిగిన మంచిపని ఇదేనని సుభాష్ పేర్కొన్నారు.మనం ఇప్పటికే ఈ దేశంలో యువతను కోల్పోతున్నామని.

వారికి మన హిందూ ధర్మం పట్ల ఆసక్తి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.అందువల్ల యువతలో హిందూ ధర్మం పట్ల ఆసక్తిని పెంపొందించడానికి ఎంత చేస్తే అంత మంచిదన్నారు.

Telugu Donates Crore, Hindu Campsite, Hindu Dharma, Hindu Heritage, Indian Ameri

టెక్సాస్‌లోని కొలంబస్‌లో 37 ఎకరాల స్థలంలో క్యాంప్‌సైట్( Hindu Campsite ) నిర్మాణం చేపట్టారు.ఇది వచ్చే వేసవి నాటికి అందుబాటులోకి రానుంది.ఆరు రాత్రులు, ఐదు రోజుల శిబిరానికి క్యాంపర్‌లను స్వాగతించనున్నారు.తొలుత ఈ శిబిరం 1985లో ప్రారంభమైంది.మౌంట్‌గోమేరీలోని క్యాంప్ లాంతర్న్ క్రీక్ వంటి పలు క్యాంప్‌సైట్‌లలో ఇది నిర్వహించారు.అయితే ఒకేసారి 1200 మందికి పైగా పాల్గొనాలంటే స్థలం సరిపోవడం లేదు.

కొత్త క్యాంప్‌సైట్‌లో క్యాబిన్‌లు, స్విమ్మింగ్ పూల్, ఏకకాలంలో 200 మందికి వసతి కల్పించే డైనింగ్ హాల్, ఔట్‌డోర్ యాంఫీ థియేటర్, కవర్ బాస్కెట్‌బాల్ కోర్టులు, తరగతి గదులు వుంటాయి.

Telugu Donates Crore, Hindu Campsite, Hindu Dharma, Hindu Heritage, Indian Ameri

2024 నాటికి రెండు వారాల పాటు శిబిరాలు నిర్వహించనున్నారు.ఆసక్తి వున్న ప్రతి ఒక్కరికీ వసతి కల్పించడానికి అవసరమైనన్ని క్యాంపులను నిర్వహించడమే తమ అంతిమ లక్ష్యమని సుభాష్ తెలిపారు.అలాగే రిట్రీట్‌లు, కార్పోరేట్ ఈవెంట్‌లు, కుటుంబ సమావేశాలను నిర్వహించుకోవడానికి ఇతరులకు క్యాంప్‌సైట్‌ను అద్దెకు ఇస్తామని ఆయన వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube