కడప నగరంలో( Kadapa ) ఓ హెడ్ కానిస్టేబుల్ తన భార్య, ఇద్దరు కుమార్తెలను పిస్టోల్ తో కాల్చి, తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం రాత్రి జిల్లాలో తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే.గురువారం ఉదయం ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించగా పోలీసుల ప్రాథమిక విచారణలో షేర్ మార్కెట్లో( Share Market ) పెట్టుబడి పెట్టి లక్షలు పోగొట్టుకోవడం, మరో మహిళతో వివాహేతర సంబంధం వల్ల ఒత్తిడి కారణంగా హెడ్ కానిస్టేబుల్ ఈ దారుణానికి వడిగట్టాడని తేలింది.
కడప నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ టి.వెంకటేశ్వర్లు (51)( Head Constable T Venkateswarlu ) రైటర్ గా విధులు నిర్వర్తిస్తుండే వారు.వెంకటేశ్వర్లు కు స్థానికంగా మంచి పేరు ఉంది.ఈయనకు భార్య మాధవి (47) తో పాటు డిగ్రీ చేస్తున్న లాస్య (21), పదో తరగతి చదువుతున్న అభిజ్ఞ(16) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
బుధవారం రాత్రి భార్యా పిల్లలు నిద్రిస్తున్న సమయంలో ముందుగా పెద్ద కూతురు లాస్య( Lasya ) నుదుటిపై పిస్తోల్ తో కాల్చాడు.ఆ తరువాత ఛాతీపైన కాల్చాడు.
ఆ తరువాత రెండవ కుమార్తె, భార్య నుదిటిపై పాయింట్ బ్లాంక్ లో కాల్చాడు.చివరికి తాను కూడా కాల్చుకొని మరణించాడు.

వేంకటేశ్వర్లు కు షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టుబడి పెట్టే అలవాటు ఉంది.దీంతో ఎన్నో లక్షలు పోగొట్టుకున్నాడు.కొన్నేళ్ల క్రితం తన సోదరుడు హైదరాబాద్ నుంచి వచ్చి దాదాపుగా రూ.20 లక్షల అప్పులు తీర్చి వెళ్ళాడు.ఈ ఏడాది బ్యాంకు నుంచి జనవరి లో వెంకటేశ్వర్లు అప్పులు( Debts ) తీసుకున్నాడు.ఇదే కాకుండా తెలిసిన వారి దగ్గర నుండి అప్పులు తీసుకుని వారికి చెక్కులు, బాండ్లు ఇచ్చాడు.
ఈ ఏడాది ఏప్రిల్ లో తన తల్లి మరణించడం తో అంత్యక్రియలు జరిపించేందుకు సహచర సిబ్బంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు.

ఇక కొన్నేళ్ల కిందట పరిచయమైన రమాదేవితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.ఆమె కూడా తెలిసిన వారి దగ్గర అప్పుచేసి డబ్బులు ఇప్పించింది.ఇక అప్పుల బాధలు ఒకవైపు.
రమాదేవి కూడా ఒత్తిడి చేస్తూ ఉండడంతో వెంకటేశ్వర్లు తన కుటుంబాన్ని తానే బలి తీసుకున్నాడు.







