తెలంగాణ రాష్ట్రంలో తాజాగా కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు విడుదల కాగా ఈ ఫలితాలలో ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు, ఒకే గ్రామానికి చెందిన వాళ్లు ఎక్కువగా ఉద్యోగాలు సాధించడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులు కానిస్టేబుల్ జాబ్ కు ఎంపికై ఔరా అనేలా చేశారు.
మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం నందిగామ గ్రామానికి చెందిన శ్రావణ్, ప్రశాంత్, సందీప్ ( Shravan, Prashant, Sandeep )కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై సత్తా చాటారు.
సంగు లక్ష్మి సంగు దుర్గయ్య( Sangu Lakshmi Sangu Durgaya ) దంపతులకు ముగ్గురు కొడుకులు కాగా తెలంగాణ కానిస్టేబుల్ పరీక్షలలో ఈ ముగ్గురు కొడుకులు అర్హత సాధించి ప్రశంసలు అందుకున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులు కానిస్టేబుల్ పరీక్షలలో మంచి ఫలితాలను సాధించడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.కష్టపడి చదివితే సక్సెస్ సాధించవచ్చని ఈ యువకులు ప్రూవ్ చేశారు.

టాలెంట్ ఉంటే కెరీర్ పరంగా సక్సెస్ సాధించి సంచలనాలు సృష్టించడం సులువేనని ఈ యువకులు ప్రూవ్ చేస్తున్నారు.గ్రామ ప్రజలు సైతం పరీక్షలలో మంచి ఫలితాలను సాధించిన ఈ ముగ్గురు యువకులను ఎంతగానో అభినందిస్తున్నారు.కానిస్టేబుల్ పరీక్షలలో మంచి ఫలితాలను సాధించడం కోసం ఈ ముగ్గురు యువకులు ఎంతో కష్టపడ్డారని సమాచారం అందుతోంది.శ్రావణ్, సందీప్, ప్రశాంత్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.
ఈ యువకులు మరింత కష్టపడితే భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలకు ఎంపికయ్యే ఛాన్స్ ఉంటుంది.ఈ యువకులు తమ సక్సెస్ తో ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే సమయంలో మంచి మార్కులు సాధించినా రిజర్వేషన్లు, ఇతర కారణాల వల్ల తమకు ఉద్యోగం రాలేదని కొంతమంది యువకులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.







