వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల గురించి మనందరికీ తెలిసిందే.ఇటీవల ఎంగేజ్మెంట్ వేడుకతో ఒకటైన ఈ జంట త్వరలోనే మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు.
అయితే ఎప్పటినుంచో వీరు ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నప్పటికీ ఆ విషయాన్ని బయట పెట్టకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు.అంతేకాకుండా వీరిద్దరి రిలేషన్ పై ఎన్నో రకాల వార్తలు వినిపించగా ఆ వార్తలను ఎప్పటికప్పుడు కొట్టి పడేస్తూ వచ్చారు.
అయితే ఎట్టకేలకు ఆ వార్తలకు పులిస్టాప్ పెడుతూ ఇటీవలే లావణ్య వరుణ్ తేజ్ ల ఎంగేజ్మెంట్ వేడుక( Varun Tej Lavanya Tripathi Engagement ) మెగా ఇంట్లో అతి కొద్ది మంది సన్నిహితులు బంధువుల సమక్షంలో సింపుల్గా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే.

అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఎంగేజ్మెంట్ తర్వాత ఈ జంట తరచూ విదేశాలకు వెళుతూ కనిపించడంతోపాటు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు.ఇంకొక నెలలో ఈ జంట పెళ్లి పీటలు కూడా ఎక్కనుందట.
ఐదేళ్ల స్నేహాన్ని ప్రేమగా మార్చుకుని జూన్ లో పెద్దల సాక్షిగా నిశ్చితార్థంతో ఒక్కటిగా మారిన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు ( Varun Tej Lavanya Tripathi Marriage ) ఇప్పుడు నవంబర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ కి రెడీ అవుతున్నారు.ఇప్పటికే పెళ్ళికి సంబందించిన షాపింగ్ మొదలు పెట్టేసింది ఈ జంట.హైదరాబాద్ లోనే వరుణ్, లావణ్యల వెడ్డింగ్ షాపింగ్ జరుగుతోంది.

ఇటలీ వేదికగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్స్( Varun Tej Lavanya Tripathi Wedding Plans ) జరుగుతున్నాయి.ఆ వేదిక, ఆ ఈవెంట్ కి సంబందించిన ఏర్పాట్లని వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు స్వయంగా చూసుకుంటున్నారు.తాజాగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి లు ముంబై ఎయిర్పోర్ట్( Mumbai Airport ) లో కనిపించగా ఫోటో గ్రాఫర్స్ వాళ్ళ వెంట పడ్డారు.
వెంటనే వారి ఫొటోస్ ని తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.లావణ్య త్రిపాఠి మోడ్రెన్ లుక్ లో కనిపించగా వరుణ్ తేజ్ నార్మల్ గా కనిపించాడు.







