ఈ సోది మాకెందుకు అనేవారు.. ఇప్పుడు నెలకు రూ.7 లక్షల ఆదాయం.. అనూష సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అద్భుతమైన టాలెంట్ ఉంది.ఆ టాలెంట్ ను గుర్తించి కెరీర్ పరంగా ముందడుగులు వేస్తే సులభంగా విజయం దక్కుతుంది.

 Simpleghar Anusha Success Story Details Here Goes Viral In Social Media , Simp-TeluguStop.com

అమ్మాయిలకు టెక్నాలజీ గురించి, గాడ్జెట్ల గురించి ఎక్కువగా అవగాహన ఉండదని చాలామంది భావిస్తారు.అయితే అది నిజం కాదని ప్రూవ్ చేస్తూ కొత్తకొత్త పరికరాలను నెటిజన్లకు పరిచయం చేస్తూ హైదరాబాద్ అమ్మాయి పలివెల నాగసత్య అనూష ప్రశంసలు అందుకుంటున్నారు.

సింపుల్ ఘర్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్( SimpleGhar Telugu ) ద్వారా అనూష తెలుగు రాష్ట్రాల నెటిజన్లకు దగ్గరవుతున్నారు.అనూష యూట్యూబ్ ఛానల్ కు ఏకంగా 11 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు.

తన సక్సెస్ స్టోరీ గురించి అనూష మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.మనలో చేయాలనే ఉత్సాహం ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని అనూష చెబుతున్నారు.

కరోనా నాకు అలాంటి ఛాన్స్ ఇచ్చిందని ఆమె అన్నారు.

తన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు అని తాడేపల్లిగూడెంలో బీటెక్ చేశానని అనూష తెలిపారు.అభిలాష్ తో పెళ్లైన తర్వాత హైదరాబాద్ కు వచ్చానని కరోనా సమయంలో ఆన్ లైన్ లో షాపింగ్ చేసిన వస్తువులలో నాణ్యత లేకపోవడం, పాడవ్వడం గమనించానని ఆమె అన్నారు.యూట్యూబ్ లో సైతం నాణ్యమైన పరికరాల సమాచారం దొరకలేదని అనూష చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో ఆన్ లైన్ లో వస్తువులను పరీక్షించి నిజాయితీగా రివ్యూ ఇవ్వాలని భావించానని అనూష అన్నారు.మొదట చేసిన కొన్ని వీడియోలకు ఆదరణ రాలేదని ఆమె తెలిపారు.మొదట్లో ఈ సోది మాకెందుకు అని నెగిటివ్ కామెంట్లు చేసేవారని కొత్తకొత్త పరికరాలను కొనుగోలు చేసి వీడియోలు చేయడం వల్ల ఆదరణ దక్కిందని ఆమె తెలిపారు.మొదట ఈ వీడియోలు ఎందుకు అని విమర్శలు చేసిన వాళ్లే ఇప్పుడు సెల్ఫీ ప్లీజ్ అని అడుగుతున్నారని అనూష చెప్పుకొచ్చారు.

నెలకు 5 నుంచి 7 లక్షల రూపాయల ఆదాయం వస్తోందని ఆమె తెలిపారు.అనూష సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుంది.

SimpleGhar Anusha Success Story

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube