ఏలియన్స్ ఉన్నాయా అన్న ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం చెప్పిన ఎలాన్ మస్క్..

గ్రహాంతరవాసులకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు ఇంకా చూడలేదని స్పేస్‌ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ ( SpaceX CEO Elon Musk )తాజాగా తెలిపారు.అక్టోబర్ 5న అజర్‌బైజాన్‌లోని బాకులో జరిగిన 74వ అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్‌లో వీడియో ప్రదర్శన సందర్భంగా అతన్ని ఈ ప్రశ్న అడిగారు.

 Elon Musk Gave An Interesting Answer To The Question Of Whether There Are Aliens-TeluguStop.com

ఈ ప్రదర్శనలో మస్క్ తన స్టార్‌షిప్ మెగా-రాకెట్, భవిష్యత్ అంతరిక్ష పరిశోధన ప్రణాళికల గురించి చర్చించారు, అయితే అతను ఏలియన్స్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కొంత సమయం తీసుకున్నాడు.గ్రహాంతరవాసుల ఆధారాలు ఏమైనా కనిపించాయా అని ప్రజలు తనను తరచుగా అడిగేవారని, దురదృష్టవశాత్తూ అవి ఎప్పుడూ కూడా తనకు కనిపించలేదని ఆయన అన్నారు.

Telugu Aliens, Elon Musk, Space, Starship Rocket, Mystery-Latest News - Telugu

తాను చెప్పగలిగినంతవరకు మనుషులే గ్రహాంతరవాసులని మస్క్ చమత్కరించాడు.అంటే ఏలియన్స్ ( Aliens )తెలివి గలవని, భూ ప్రపంచం కోసం అవేవో మేలు చేస్తాయని ఆశించడం కంటే సొంతంగా మానవులే సమాజం కోసం అద్భుతమైన ఆవిష్కరణలు చేయాలని మస్క్ పరోక్షంగా చెప్పారు.గ్రహాంతర వాసులు ఉన్నారో లేదో తెలుసుకోవడంలో తానే మొదటి వ్యక్తిని కావచ్చు అని, అయితే వాటికి సంబంధించిన ఆధారాలు తనకు ప్రస్తుతానికైతే కనిపించలేదని చెప్పారు.ఇకపోతే మస్క్ తన స్టార్‌షిప్ మెగా-రాకెట్ ప్రాజెక్ట్( Mega-Rocket Project ) అంతరిక్ష పరిశోధనలకు చాలా ముఖ్యమైనదని అన్నారు.

స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 1 రాకెట్ కంటే ఇది చాలా మెరుగైనదని ఆయన పేర్కొన్నారు.గ్రహాంతర వాసులు ఉన్నారని తాను అనుకోవడం లేదని అన్నారు.అయితే ఇంతకు ముందు వారిపై జోకులు వేశారు.మస్క్ తన కృత్రిమ మేధస్సు సంస్థ, xAI, గ్రహాంతర నాగరికతలు ఉనికిలో ఉంటే వాటిని సంప్రదించడంలో మనకు సహాయపడగలదని చెప్పారు.

మనకంటే అడ్వాన్స్డ్ ఏలియన్స్ ఈ విశ్వంలో నివసిస్తున్నారా అనే ప్రశ్న సైన్స్, అంతరిక్ష అన్వేషణ రహస్యాలలో ఒకటిగా మిగిలిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube