టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య బాబు( Balakrishna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
వరుసగా హిట్ లను అందుకుంటూ దూసుకుపోతున్నారు బాలయ్య బాబు.ఇక బాలయ్య బాబు నటించిన గత సినిమాలు అఖండ,వీర సింహారెడ్డి విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించాయి.
ఇప్పుడు అదే ఉత్సాహంతో త్వరలోనే మరో మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు బాలయ్య బాబు.

కాగా బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి.( Bhagavanth Kesari ) ఈ సినిమాకు అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నారు.అలాగే త్వరలోనే ఈ మూవీకి సంబందించిన ప్రమోషన్న్ ని కూడా మొదలు పెట్ట నున్నారు.
ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ టీజర్ పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ గురించి గురువారమే ప్రకటన వెలువడింది.

దీన్ని అక్టోబర్ 8వ తేదీన విడుదల చేయబోతున్నట్లు అందులో వెల్లడించారు.అయితే భగవంత్ కేసరి మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను ఎలా రిలీజ్ చేయబోతున్నారు అన్న దానిపై మాత్రం ఎటువంటి క్లారిటీ రాలేదు.దీంతో ఎన్నో రకాల ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం.ఈ సినిమా ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు( Mahesh Babu ) చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారట.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇద్దరు హీరోల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.







