నిస్తేజంలో ఉన్న క్యాడర్ కోసం టీడీపీ సొంత సర్వే..? ఏమారుస్తూ ఉత్తుత్తి ఫలితాలు..!!

ఏపీలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కోల్పోతుందా అంటే అవుననే సంకేతాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.

 Tdp's Own Survey For Dull Cadre..? What Are The Results Of Fake..!!-TeluguStop.com

ఇన్ని రోజులుగా ఢిల్లీలోనే ఉన్నా నారా లోకేశ్ ఈరోజే రాష్ట్రానికి వచ్చారు.అయితే చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పార్టీలో గట్టి నాయకుడే లేడని చెప్పుకోవచ్చు.

దీంతో పార్టీ క్యాడర్ తీవ్ర నిరాశలో కూరుకుపోయింది.ఈ క్రమంలో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు టీడీపీ సరికొత్తగా అబద్ధపు సర్వేలను తెరపైకి తెచ్చిందని తెలుస్తోంది.

సాధారణంగా ఇంటిలో పిల్లలు చదవకుండా ఉండి మార్కులు తక్కువ వస్తే ప్రొగ్రెస్ కార్డుల్లో అంకెలను దిద్దేసి తల్లిదండ్రులను మాయ చేస్తుంటారు.దీంతో మా పిల్లలు బాగా చదివేస్తున్నారంటూ పేరెంట్స్ తెగ సంతోషపడుతుంటారు.

అదే తరహాలో టీడీపీ సైతం క్యాడర్ కు మాయ మాటలు చెబుతుందని తెలుస్తోంది.తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలతో ఇన్నాళ్లు నెట్టుకొచ్చిన పార్టీకి అత్యంత గడ్డు పరిస్థితి వచ్చిందని కొందరు అంటున్నారు.

సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి వెళ్లడంతో టీడీపీ పునాదులు కదిలిపోయాయి.ఇటీవల వచ్చిన టైమ్స్ నౌ, ఇతర సర్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని, దాదాపు 50 శాతం ఓట్లతో 24-25 లోక్ సభ సీట్లు సాధిస్తుందని వెల్లడి అయింది.

అంతేకాదు పోల్ స్ట్రాటజీ గ్రూప్ చేపట్టిన సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ 49 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉండగా, టీడీపీ జనసేన కలిపి 41 శాతం ఓట్లు తెచ్చుకుంటాయని తెలిసింది.ఫలితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఎదురులేని మెజారిటీ సాధ్యం అవుతుందని, టీడీపీ- జనసేన కలిసినా ఫ్యాన్ ముందు కనీసం నిలిచే అవకాశం కూడా లేదని సర్వేలు ద్వారా తెలుస్తోంది.

రాష్ట్ర ప్రజల్లో జగన్ ప్రభుత్వం పట్ల ఉన్న ఆదరణ చూసి టీడీపీ బెంబేలెత్తుతోంది.అయినా తమ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు టీడీపీ ఓ కొత్త సొంత సర్వేను తయారు చేయించి విడుదల చేసిందని ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇందులో భాగంగా ఇండియా టీవీ సీఎన్ఎక్స్ పేరిట విడుదలైన ఓ సర్వే హల్ చల్ చేస్తుంది.దీని ప్రకారం రానున్న లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 46 శాతం ఓట్లతో 15 లోక్ సభ స్థానాలు, తెలుగు దేశం పార్టీకి 42 శాతం ఓట్లతో పది లోక్ సభ స్థానాలు వస్తాయని టీడీపీ చెప్పుకోస్తుందట.

గత ఎన్నికల్లో కేవలం మూడు ఎంపీ సీట్లను మాత్రమే తెచ్చుకున్న టీడీపీ ఈసారి ఏకంగా పది సీట్లు వస్తాయని సర్వే చెబుతుండటం హాస్యాస్పదంగా ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీకి దాదాపు 70 నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ లే లేరు.

ఎంపీ టికెట్ అడిగే వారు కూడా లేరని తెలుస్తోంది.అదికాక సీఎం జగన్ దూకుడు ముందు నిలిచే ధైర్యం లేక పోటీకి సైతం రాం.రాం అంటున్నారట.అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న టీడీపీకి పది ఎంపీ సీట్లు ఏ విధంగా వస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఈ క్రమంలోనే సర్వే అంతా కేవలం పార్టీ క్యాడర్ ను నిద్ర లేపడానికి సొంతంగా విడుదల చేశారు తప్ప అందులో ఏ మాత్రం వాస్తవం లేదని ఆ పార్టీ కార్యకర్తలే అంటున్నారని సమాచారం.

అంతేకాదు ప్రజాదరణ కోల్పోయి, హామీలను సైతం గాలికి వదిలేసిన పార్టీగా నిలిచిన టీడీపీకి కార్యకర్తలు సైతం దూరం అవుతున్నారని తెలుస్తోంది.

మరోవైపు చంద్రబాబు చెంచాలు కొందరు మాత్రం ఎప్పటి తరహాలోనే భారీగా ఎలివేషన్లు ఇస్తూ ఇంకా ప్రజలను మభ్య పెట్టాలనే చూస్తున్నారట.ఈ క్రమంలోనే సర్వేలను సైతం తారుమారు చేస్తూ సొంతంగా కావాల్సినట్లుగా సర్వేలను రెడీ చేయించుకుంటూ కొందరు టీడీపీ నేతలు ఇంకా ప్రజలను ఏమార్చలని చూస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏదీ ఏమైనా ఏపీలో టీడీపీ టైం అయిపోయిందని మరోసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని అక్కడి ప్రజలు అనుకుంటున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube