చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా అరెస్టు కావడంతో ఈ విషయంపై పలువురు సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఇప్పటికే పలువురు ఈ విషయంపై స్పందిస్తూ చంద్రబాబు నాయుడు అరెస్టునే తప్పు పట్టారు.
ఇకపోతే ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పలు అంశాలపై ఆయన స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు.ఈ క్రమంలోని చంద్రబాబు నాయుడు గురించి కూడా ఈయన మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చిట్టి బాబు ( Chitti babu ) కేవలం నిర్మాతగా మాత్రమే కాకుండా బిజెపి నేతగా కూడా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ సందర్భంగా ఈయన చంద్రబాబు గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇప్పుడే కాదు ఆది నుంచి కూడా ఆయన తాను చేయకపోయినా ఆ పనులను కూడా తానే చేశాను అంటూ గొప్పలు చెబుతూ ఉంటారని ఈయన తెలిపారు.హైదరాబాదులో అన్ని తానే చేశానని చంద్రబాబు నాయుడు తరచూ గొప్పలు చెబుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు క్రియేటర్ కాదు ఆయన ఒక డెకరేటర్( Decorator ) అంటూ చిట్టి బాబు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఐటీ హైదరాబాద్ కి నేనే పరిచయం చేశారని చంద్రబాబు నాయుడు గొప్పగా చెబుతూ ఉంటారు.ఐటీ భూమ్( IT Boom ) వచ్చినపుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మాత్రమే ఉన్నారు.కానీ హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసినది మాత్రం నేదురు మల్లి జనార్దన్ రెడ్డి ( Nedurumalli Janarthdan Reddy )అంటూ ఈ సందర్భంగా చిట్టిబాబు తెలిపారు.
ఆ సమయంలో చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా హైదరాబాద్( Hyderabad IT ) కి ఐటీ భూమ్ వచ్చేదని అయితే తానే హైటెక్ సిటీ( Hitech City ) కట్టాను అంటూ ఈయన చెప్పుకుంటున్నారని తెలిపారు.ఇలా ప్రతి ఒక్క విషయాన్ని తానే చేశాను అంటూ గొప్పలు చెప్పుకోవడం చంద్రబాబు నాయుడుకి అలవాటుగా మారిపోయింది అంటూ ఈయన తెలియచేశారు.







