చంద్రబాబు క్రియేటర్ కాదు డెకరేటర్… నిర్మాత చిట్టిబాబు కామెంట్స్ వైరల్!

చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా అరెస్టు కావడంతో ఈ విషయంపై పలువురు సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఇప్పటికే పలువురు ఈ విషయంపై స్పందిస్తూ చంద్రబాబు నాయుడు అరెస్టునే తప్పు పట్టారు.

ఇకపోతే ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పలు అంశాలపై ఆయన స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోని చంద్రబాబు నాయుడు గురించి కూడా ఈయన మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

"""/" / చిట్టి బాబు ( Chitti Babu ) కేవలం నిర్మాతగా మాత్రమే కాకుండా బిజెపి నేతగా కూడా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ సందర్భంగా ఈయన చంద్రబాబు గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇప్పుడే కాదు ఆది నుంచి కూడా ఆయన తాను చేయకపోయినా ఆ పనులను కూడా తానే చేశాను అంటూ గొప్పలు చెబుతూ ఉంటారని ఈయన తెలిపారు.

హైదరాబాదులో అన్ని తానే చేశానని చంద్రబాబు నాయుడు తరచూ గొప్పలు చెబుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు క్రియేటర్ కాదు ఆయన ఒక డెకరేటర్( Decorator ) అంటూ చిట్టి బాబు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

"""/" / ఐటీ హైదరాబాద్ కి నేనే పరిచయం చేశారని చంద్రబాబు నాయుడు గొప్పగా చెబుతూ ఉంటారు.

ఐటీ భూమ్( IT Boom ) వచ్చినపుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మాత్రమే ఉన్నారు.

కానీ హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసినది మాత్రం నేదురు మల్లి జనార్దన్ రెడ్డి ( Nedurumalli Janarthdan Reddy )అంటూ ఈ సందర్భంగా చిట్టిబాబు తెలిపారు.

ఆ సమయంలో చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా హైదరాబాద్( Hyderabad IT ) కి ఐటీ భూమ్ వచ్చేదని అయితే తానే హైటెక్ సిటీ( Hitech City ) కట్టాను అంటూ ఈయన చెప్పుకుంటున్నారని తెలిపారు.

ఇలా ప్రతి ఒక్క విషయాన్ని తానే చేశాను అంటూ గొప్పలు చెప్పుకోవడం చంద్రబాబు నాయుడుకి అలవాటుగా మారిపోయింది అంటూ ఈయన తెలియచేశారు.