హన్మకొండ జిల్లాలోని మడికొండలో ఐటీ టవర్ ప్రారంభమైంది.ఈ మేరకు ఐటీ టవర్ ను మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో అన్ని ప్రాంతాలకు ఐటీ విస్తరిస్తోందని తెలిపారు.హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ అభివృద్ధి అవుతుందోన్నారు.
అయితే వరంగల్ ను ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.రాబోయే పది సంవత్సరాలలో హైదరాబాద్ కు వరంగల్ కు తేడా ఉండదని చెప్పారు.
రాష్ట్రంలో అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన తెలిపారు.







