Month Of Madhu Movie : మంత్ ఆఫ్ మధు రివ్యూ అండ్ రేటింగ్!

కలర్స్ స్వాతి( Swathi Reddy ) చాలా గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ‘మంత్ అఫ్ మధు’ ( Month of Madhu ).నవీన్ చంద్ర, శ్రేయ నవిలే, జ్ఞానేశ్వరి, మంజుల, వైవా హర్ష ముఖ్య పాత్రల్లో ఈ సినిమా శ్రీకాంత్ నగోతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇలా చాలా రోజుల తర్వాత స్వాతి నటించినటువంటి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది? అసలు ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే.

 Month Of Madhu Movie : మంత్ ఆఫ్ మధు రివ్యూ అ-TeluguStop.com

కథ:

ఈ సినిమా కథ రెండు భాగాలుగా దర్శకుడు తెరపై చూపించినట్టు తెలుస్తుంది.అయితే నవీన్ చంద్ర కలర్స్ స్వాతి కాలేజీ సమయంలోనే ప్రేమించుకుని పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు.అయితే పెళ్లి తర్వాత వీరిద్దరు కొన్ని విభేదాలు కారణంగా విడాకులకు అప్లై చేస్తారు అయితే విడాకులు తీసుకున్న తర్వాత కూడా నవీన్ చంద్ర( Naveen Chandra ) తనకు స్వాతి కావాలని కోరుకుంటారు.

ఇలా విడాకుల తీసుకోవడంతో ఈయన ఎప్పుడు తాగుడుకు బానిసై తాగుతూనే కనిపిస్తారు.ఇక ఇదే సినిమాలో మరొక జంట ప్రేమ కథను కూడా డైరెక్టర్ శ్రీకాంత్ చూపించారు.

మరో కథలో అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన ఒక టీనేజీ అమ్మాయి ప్రేమ అని ఒక అబ్బాయితో తిరుగుతుంది.స్వాతి, నవీన్ విడాకుల సంగతి ఏమైంది? ఆ అమెరికా టీనేజీ అమ్మాయి ప్రేమ ఏమైంది అని రెండు కథలని దర్శకుడు చూపించారు.

Telugu Madhu, Madhu Review, Naveen Chandra, Review, Srikanth, Swathi Reddy, Toll

నటీనటుల నటన:

ఎంతో మంచి నటుడు అయినటువంటి నవీన్ చంద్ర తన పాత్ర వరకు న్యాయం చేశారు అయితే ఈ సినిమాలో ఈయన నిత్యం తాగుతూనే కనిపిస్తుంటారు.చాలా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినటువంటి కలర్స్ స్వాతి ఇలాంటి ఒక సినిమాను ఎందుకు ఎంపిక చేసుకుందో అర్థం కావడం లేదు.ఇక కొత్తమ్మాయి శ్రేయ తన నటనతో పరవాలేదు అనిపించేలాగా నటించారు.మంజుల, వైవా హర్ష ( Viva Harsha )తమ పాత్రల వరకు బాగా నటించారు.

టెక్నికల్:

శ్రీకాంత్ ఒకే సినిమాలో రెండు కథలను ఎంపిక చేసుకోవడం ప్రేక్షకులకు అంతు పట్టని విషయంగా మారిపోయింది.సంగీతం కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది .ఇక ఫోటోగ్రఫీ కూడా అంత మాత్రమే అనిపించేలాగా ఉంది.

Telugu Madhu, Madhu Review, Naveen Chandra, Review, Srikanth, Swathi Reddy, Toll

విశ్లేషణ:

ఇదివరకే ఇలా ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులతో విడిపోయిన కథ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి.అయితే ఈ సినిమా కూడా రొటీన్ సినిమా లాగే ఉంది కథ మొత్తం ఒకే పాయింట్ మీద సాగతీశారు.

Telugu Madhu, Madhu Review, Naveen Chandra, Review, Srikanth, Swathi Reddy, Toll

ప్లస్ పాయింట్స్:

కొత్త నటి శ్రేయ నటన, అక్కడక్కడ సన్నివేశాలు.

మైనస్ పాయింట్స్: సినిమాకు కథ మైనస్ పాయింట్ అనే చెప్పాలి.ఒకే పాయింట్ పై సినిమాని మొత్తం సాగదీసారు.సినిమా అంతా నవీన్ చంద్ర తాగుతూనే ఉండడం కలర్స్ స్వాతి ఏడవడం బోర్ కొట్టిస్తుంది.

బాటమ్ లైన్:

స్వాతి చాలా రోజుల తర్వాత సినిమాలలోకి వచ్చి ఇలాంటి కథ ఎందుకు ఎంపిక చేసుకున్నదో తెలియదు.అసలు ఈ సినిమా ఏ పాయింట్ మీద డైరెక్టర్ ఎక్కించారు అనే విషయం అంతుచిక్కలేదు.మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందని చెప్పాలి.

రేటింగ్: 2/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube