వందల కోట్లు పెట్టి ఇలా ఆలస్యం చేస్తే నిర్మాతల పరిస్థితి ఏంటి పవన్‌?

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తీరు ఏమాత్రం అర్థం కావడం లేదు అంటూ స్వయంగా ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.అజ్ఞాత వాసి తర్వాత నేను సినిమా లు చేయను రాజకీయాలు చేస్తాను అంటూ బిజీ అయిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత నాకు, నా కుటుంబ అవసరానికి మరియు పార్టీ మనుగడ కోసం డబ్బు కావాలి.

 Pawan Kalyan Doing 3 Movies With Big Budget But Producers Facing Problems Detail-TeluguStop.com

ఆ డబ్బు నాకు సినిమాల ద్వారా మాత్రమే వస్తుంది.అందుకే నేను మళ్లీ సినిమా ల్లో నటిస్తాను అంటూ వరుసగా అయిదు ఆరు సినిమా లకు కమిట్ అయ్యాడు.

నిర్మాతలు ఈయన్ను నమ్మి వందల కోట్ల బడ్జెట్‌ ను పెడుతున్నారు.కేవలం పారితోషికంగా 75 నుంచి 100 కోట్ల పారితోషికం ఇస్తున్నారు.

Telugu Harihara, Og, Pawan Kalyan, Pawankalyan, Ustad Bhagath-Movie

ఇక మేకింగ్ కి ఎంత ఖర్చు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.నిర్మాతలు( Producers ) అంతగా ఖర్చు చేస్తున్నప్పుడు కచ్చితంగా పవన్‌ వారి శ్రేయస్సు ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.పవన్‌ కళ్యాణ్ హరి హర వీరమల్లు( Hari Hara Veeramallu ) సినిమా ప్రారంభం అయ్యి ఎన్నాళ్లు అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆ సినిమా కోసం నిర్మాత ఇప్పటికే వంద కోట్ల వరకు ఖర్చు చేసి ఉంటాడు.

ఇక ఓజీ( OG Movie ) మరియు ఉస్తాద్‌ భగత్‌ సింగ్( Ustaad Bhagat Singh ) సినిమా లు కూడా భారీగా ఖర్చు పెట్టి తీస్తున్నారు.ఈ మూడు సినిమా లు మధ్య లో ఉన్నాయి.

Telugu Harihara, Og, Pawan Kalyan, Pawankalyan, Ustad Bhagath-Movie

మూడు సినిమాలకు కూడా దాదాపుగా రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేశారు.మరో రెండు వందల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉండవచ్చు.నిర్మాతలు అంతగా ఖర్చు పెట్టారు.వెంటనే సినిమా లు వస్తే పర్వాలేదు.కానీ సినిమా ఆలస్యం అయినా కొద్ది నిర్మాతలు ఆ మొత్తం కు వడ్డీలు చెల్లిస్తూ ఉండాలి.

అప్పుడు సినిమా లు హిట్ అయినా కూడా లాభం లేదు అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ముందు ముందు అయినా పవన్‌ కళ్యాణ్‌ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube