నందమూరి బాలకృష్ణ ( Balakrishna )వరుసగా అఖండ మరియు వీర సింహా రెడ్డి సినిమా( Veera Simha Reddy ) లతో బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాడు.ఆయన నుంచి మరో సినిమా గా భగవంత్ కేసరి ( Bhagavanth Kesari )సినిమా రాబోతుంది.
ఈ సినిమా టైటిల్ విభిన్నంగా ఉన్నా కూడా మరో విజయాన్ని బాలయ్య కు కట్టబెట్టడం ఖాయం అంటున్నారు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) నటించగా కీలక పాత్ర లో శ్రీలీల కనిపించబోతుంది.

కథ మొత్తం కూడా శ్రీలీల చుట్టు తిరుగుతూ ఉంటుందని తెలుస్తోంది.ఇటీవల విడుదల అయిన పాటలను చూస్తూ ఉంటే బాలయ్య చాలా కొత్తగా ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది.దసరా కి రాబోతున్న బాలయ్య కచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక ఇదే దసరా కి బాలయ్య హీరో గా బాబీ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన అప్డేట్ ని ఇవ్వబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.దసరా సెంటిమెంట్ తో బాలయ్య, బాబీ కాంబో లో రూపొందుతున్న సినిమా ఫస్ట్ లుక్ వస్తే తప్పకుండా ఆ సినిమా సంక్రాంతికి వచ్చి ప్రేక్షకులకు వినోదాన్ని పంచే అవకాశాలు ఉన్నాయి

అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి దసరా కి బాలయ్య( Balakrishna ) డబుల్ ధమాకా ఖాయం అని… ఆయన అభిమానులకు దసరా పండుగ డబుల్ అవ్వడం కన్ఫర్మ్ అన్నట్లుగా ఇండస్ట్రీ మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు.బాబీ గత చిత్రం వాల్తేరు వీరయ్య భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.అందుకే ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.చిరు కి భారీ విజయాన్ని ఇచ్చిన దర్శకుడు బాబీ ఈసారి బాలయ్య కోసం ఓ భారీ బ్లాక్ బస్టర్ ని రెడీ చేస్తున్నాడు.అది దసరా కి ఫస్ట్ లుక్ రాబోతుంది.







