ఇదే నా చివరి సినిమా... షాకింగ్ కామెంట్స్ చేసిన జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో అనుదీప్ ( Anudeep ) ఒకరు.అనుదీప్ సినిమాలు అంటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం గ్యారెంటీ అనే విషయం మనకు తెలిసిందే.

 Director Kv Anudeep Says Good Bye To Acting In Movies , Anudeep, Jathi Ratnalu,-TeluguStop.com

పిట్టగోడ ( Pittagoda సినిమా ద్వారా ఈయన దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.జాతి రత్నాలు ( Jathi Ratnalu ) సినిమా ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున నవ్వించారు.

ఈయన సినిమాలు మాత్రమే కాకుండా ఇంటర్వ్యూలకు హాజరైతే ఇంటర్వ్యూలలో కూడా ఈయన నోటి నుంచి వరుసగా పంచ్ డైలాగ్స్ పేలుతూనే ఉంటాయి.ఇక తాజాగా ఈయన మ్యాడ్ ( Mad) అనే సినిమాలో నటించారు.

Telugu Anudeep, Jathi Ratnalu, Mad, Suma, Tollywood-Movie

ఈ సినిమా అక్టోబర్ ఆరవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో బుధవారం ఎంతో ఘనంగా ప్రీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా అనుదీప్ మాట్లాడుతూ.ఇదే నా చివరి సినిమా అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సినిమాలో తాను కూడా భాగమయ్యానని తెలిపారు.డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తనని ఈ సినిమాలో నటించమని కోరితేనే తాను నటించానని తెలిపారు.ఇలా అనుదీప్ మాట్లాడుతూ ఉండగా మధ్యలో సుమ( Suma ) వచ్చి జాతి రత్నాలు సినిమాలో కూడా మీరు నటించారు.

ఈ సినిమాలో కూడా మీరు నటించారు ముందు ముందు మిమ్మల్ని హీరోగా చూడాలని కోరుకుంటున్నామని మాట్లాడారు.

Telugu Anudeep, Jathi Ratnalu, Mad, Suma, Tollywood-Movie

ఈ విధంగా సుమ మాట్లాడటంతో వెంటనే అనుదీప్ మాట్లాడుతూ లేదండి.ఇకపై ఇదే నా చివరి సినిమా నేను సినిమాలలో నటించమని యాక్టింగ్ కి పూర్తిగా గుడ్ బై చెబుతున్నానని ఈయన తెలియజేశారు.ఇలా ఈయన నటుడిగా మాత్రమే సినిమాలకు దూరమవుతారని దర్శకుడుగా మాత్రం కాదంటూ ఈ సందర్భంగా తెలిపారు.

ఇక ఈయన దర్శకత్వంలో ముందు ముందు ఎంతో మంచి సినిమాలు రావాలని ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube