తెలుగు సినీ ఇండస్ట్రీలోకి దేవదాసు సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమయ్యారు గోవా బ్యూటీ ఇలియానా(Ileana).ఇలా దేవదాసు (Devadasu) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
అనంతరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమా(Pokiri Movie) ద్వారా బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని అందుకున్నారు.ఇలా ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె వెనక్కి తిరిగి చూసుకోలేదు ఇలా కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ ఒకానొక సమయంలో సౌత్ ఇండస్ట్రీని ఓ రేంజ్ లో ఊపేశారు.
ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఇలియానా అనంతరం ఈమె నటించిన సినిమాలన్నీ కూడా ఒక్కొక్కటి ఫ్లాప్ కావడంతో కెరియర్ పరంగా అవకాశాలు కూడా కాస్త తగ్గిపోయాయి.ఇలా అవకాశాలు తగ్గిపోవడంతో సౌత్ ఇండస్ట్రీ నుంచి ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీకి( Bollywood ) వెళ్లి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నాలు చేశారు.
అయితే అక్కడ కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.దీంతో ఈమె ఇండస్ట్రీకి దూరమైపోయారు.ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఇలియానా సోషల్ మీడియాలో మాత్రం తరచూ బికినీ ఫోటోషూట్స్ చేయించి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసేవారు.
ఇలా బికినీలో టెంప్టింగ్ పూజలతో అందరికీ పిచ్చెక్కించే ఈమె ఉన్నఫలంగా తాను ప్రెగ్నెంట్( Pregnant ) అనే విషయాన్ని ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు.ఇలా ఈమె ప్రెగ్నెన్సీ న్యూస్ చెప్పడంతో ఇప్పుడు కాలంలో పెళ్లి కాకుండా తల్లి కావడం ఫ్యాషనా ఏంటి అంటూ అందరూ షాక్ అయ్యారు.అయితే ఈమె రహస్యంగా వివాహం చేసుకున్నారు అంటూ వార్తలు వచ్చినప్పటికీ ఈ విషయం గురించి ఎక్కడ స్పందించకపోవడంతో అసలు ఈమెకు పెళ్లి జరిగిందా లేదా అన్న ఆలోచనలలో అందరూ ఉన్నారు.
ఇలా గర్భం దాల్చినటువంటి ఈమె తరచూ తన ప్రేగ్నెన్సీ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునేవారు.
ఈ విధంగా ఇలియానా తన ప్రెగ్నెన్సీ విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నప్పటికీ తన ప్రేగ్నెన్సీకి కారణమైనటువంటి వ్యక్తి గురించి మాత్రం ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు.ఇక ఇలియానా ఆగస్టు ఒకటవ తేదీ పండంటి మగ బిడ్డకు( Baby Boy ) జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇలా తనకు కొడుకు పుట్టాడు అంటూ ఈ విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఇక్కడ తన కొడుకు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికి పరిమితమైనటువంటి ఇలియానా తన కొడుకుతో దిగినటువంటి ఫోటోలను తరచు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసేవారు.
ఇలా తన కొడుకు పుట్టిన వేల విశేషం ఏంటో కానీ ఇలియానా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.ఇంతకీ ఇలియానా చెప్పినటువంటి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనే విషయానికి వస్తే… ఇన్ని రోజులపాటు సినిమా అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన అవకాశం లేకపోవడంతో ఎంతో నిరుత్సాహపడినటువంటి ఈమెకు ఒక వెబ్ సిరీస్ లో( Web Series ) నటించే అవకాశం వచ్చిందని తెలుస్తోంది.ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సిరీస్ లో నటించమని ఇలియానాకు అవకాశం కల్పించారట.
ఆయనే స్వయంగా తనకి ఫోన్ చేసి ఈ వెబ్ సిరీస్ లో నటించాలని చెప్పడంతో ఇలియానా కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఇదంతా తన కొడుకు పుట్టిన వేళా విశేషం అంటూ ఎంతో సంబరం వ్యక్తం చేస్తున్నారట.అయితే ఈ వెబ్ సిరీస్ గురించి ఇంకా ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదని తెలుస్తుంది.