అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీ రెండు పార్ట్స్ గా రాబోతోందా.. క్లారిటీ ఇదే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) క్రేజ్ పుష్ప సినిమాతో వరల్డ్ వైడ్ గా పెరిగింది అనే చెప్పాలి.ప్రజెంట్ ఈ సినిమాకు సీక్వెల్ గా ”పుష్ప ది రూల్”( Pushpa The Rule ) చేస్తున్నాడు.

 Allu Arjun Another Sensational Franchise, Pushpa The Rule, Pushpa 2, Allu Arjun,-TeluguStop.com

పాన్ ఇండియన్ దగ్గర భారీ హైప్ ఉన్న బిగ్గెస్ట్ సినిమాల్లో పుష్ప టాప్ లో ఉంది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ శరవేగంగా షూట్ పూర్తి చేస్తున్నారు.

Telugu Allu Arjun, Alluarjun, Guntur Kaaram, Mahesh Babu, Pushpa, Pushpa Rule, S

ఎర్రచందనం స్మగ్లింగ్( Sandalwood Smuggling ) నేపథ్యంలో సాగే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇప్పుడు యావత్ ప్రపంచం ఈ సినిమా సీక్వెల్ కోసం ఎదురు చూస్తుంది.ఈ సినిమా 2024 ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది.ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.ఇప్పటికే అఫిషియల్ ప్రకటన కూడా వచ్చేసింది.

ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో తెలియదు కానీ ఇది కూడా ప్రాంచైజ్ చేసే ఛాన్స్ ఉందని ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది.పుష్ప ఇప్పటికే సీక్వెల్ తెరకెక్కుతుంది.

మరి అల్లు అర్జున్ నుండి మరో సీక్వెల్ రాబోతుందని తెలుస్తుంది.దీంతో ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

మన టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రజెంట్ సీక్వెల్ ట్రెండ్ నడుస్తుంది.

Telugu Allu Arjun, Alluarjun, Guntur Kaaram, Mahesh Babu, Pushpa, Pushpa Rule, S

మరి అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ కూడా రెండు పార్ట్స్ గా సినిమాను తెరకెక్కించ బోతున్నారని సమాచారం.ఈ విషయాన్నీ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ( Producer Naga Vamsi ) లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.కాగా ఈ సినిమాను గీతా ఆర్ట్స్ తో కలిసి హారిక హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందించనున్నాడు.

ఇదిలా ఉండగా త్రివిక్రమ్ కూడా మహేష్ బాబుతో ప్రజెంట్ ‘గుంటూరు కారం'( Guntur Karam ) చేస్తున్నాడు.ఇలా ఈ ఇద్దరి ప్రాజెక్టులు పూర్తి అయితే కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube