రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని విషయాన్ని మరోసారి టిడిపి జనసేన పొత్తు నిర్ధారించింది .గతంలో టిడిపి పై విమర్శలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన స్వరం మార్చారు .
ఒకవైపు బిజెపితో పొత్తు కొనసాగిస్తూనే టిడిపి తో సఖ్యతగా ఉంటూ వచ్చారు. చంద్రబాబు అరెస్టు( Chandrababu arrest ) తరువాత టిడిపి తో పొత్తు పెట్టుకోబోతున్నట్లు స్వయంగా పవన్ ప్రకటించారు.
అంతకుముందే రెండు పార్టీల పొత్తుపై అనేకసార్లు చర్చలు జరిగాయి.అయితే జనసేనకు కొద్ది సీట్లు మాత్రమే ఇచ్చేందుకు టిడిపి అంగీకారం తెలపగా, పవన్ సైతం అంగీకారం తెలిపారు.
అయితే ప్రస్తుతం రాజకీయ పరిస్థితి మారింది టిడిపి బలహీనమైనట్టుగా కనిపిస్తోంది. ఒకవైపు చంద్రబాబు అరెస్టు కాగా , మరోవైపు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) సైతం అరెస్టు అయ్యే అవకాశాలు ఉండడం, టిడిపి క్యాడర్ అయోమయానికి గురవుతుండడం, గతంతో పోలిస్తే టిడిపి బాగా బలహీన పడినట్లుగా అనేక సర్వేలు స్పష్టం చేస్తుండడంతో పవన్ వ్యూహం మార్చారు.

కచ్చితంగా జనసేనతో వెళితేనే టిడిపికి( TDP ) భవిష్యత్తు ఉంటుందనే అంచనాలో టిడిపి నాయకులు ఉండగా, పవన్ సైతం ఆ విషయాన్ని గ్రహించారు.టిడిపి జనసేన పొత్తు లో భాగంగా జనసేనకు వీలైనన్ని ఎక్కువ సీట్లు తీసుకోవాలని పవన్( Pawan Kalyan ) నిర్ణయించుకున్నారట .తెలంగాణలో పెద్దగా బలం లేకపోయినా, అక్కడ త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి సిద్ధమైంది.32 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని పవన్ నిర్ణయించారు.తెలంగాణలో జనసేనకు అంతంత మాత్రమే బలం ఉన్నా, అక్కడ 32 స్థానాల్లో పోటీ చేస్తుండడంతో, ఏపీలో అంతకంటే ఎక్కువ స్థానాల్లో జనసేన పోటీ చేయాలని నిర్ణయించింది.….m moపొత్తులో భాగంగా టిడిపి కచ్చితంగా 30 నుంచి 40 స్థానాలకు పైగా జనసేన( Janasena )కు కేటాయించాలని డిమాండ్ ను పవన్ వినిపించబోతున్నారట ..

ఉమ్మడి గోదావరి జిల్లాలో జనసేనకు ఉన్న బలం అక్కడ పవన్( Pawan Kalyan ) బలంతో మెజార్టీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉండడంతో పవన్ డిమాండ్లకు టిడిపి అంగీకరించాల్సిన పరిస్థితి నెలకొందట.ఇప్పటికే సీట్లు , పవర్ షేరింగ్ పై జనసేన నుంచి అనేక డిమాండ్లు టిడిపికి వస్తున్నాయి.ప్రస్తుతం టిడిపి ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా, దాదాపు పవన్ డిమాండ్లను నెరవేర్చాల్సిన పరిస్థితి ఆ పార్టీకి ఏర్పడింది.అయితే టిడిపి ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పవన్ ముందు ముందు మరిన్ని డిమాండ్లు పెట్టే అవకాశం ఉండడంతో జనసేన విషయంలో టిడిపి టెన్షన్ పడుతోందట.







