భారీ ధరలకు చంద్రముఖి 2 ఓటీటీ రైట్స్... స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ అంటే?

డైరెక్టర్ పి.వాసు దర్శకత్వంలో రజనీకాంత్ జ్యోతిక నయనతార వంటి వారు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం చంద్రముఖి( Chandra Mukhi ) ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే.

 Chandramukhi 2 Ott Rights Were Sold Huge Price Full Details Here, Chandramukhi,-TeluguStop.com

ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా విడుదలైనటువంటి 17 సంవత్సరాలకు చంద్రముఖి 2( Chandramukhi 2 ) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ విడుదలైనప్పటికీ అనుకున్న స్థాయిలో పెద్దగా ఆదరణ సంపాదించుకోలేకపోయింది.

ఈ సీక్వెల్ చిత్రంలో రజనీకాంత్ స్థానంలో నటుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) నటించిన జ్యోతిక స్థానంలో ప్రముఖ నటి కంగనా నటించారు.ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైనప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైనదని చెప్పాలి.ఇక ఇప్పటికే థియేటర్లో భారీగా కలెక్షన్స్ పడిపోయాయి.ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్(Net Flix) భారీ ధరలకు కొనుగోలు చేశారని తెలుస్తోంది.

ఏకంగా 8 కోట్ల రూపాయలతో ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారని తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు ఈ సినిమాని థియేటర్లలో విడుదలైన నెలన్నర తర్వాత నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయాలని భావించారు అయితే థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ రాకపోవడంతో ముందుగానే ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు.ఈ క్రమంలోనే అక్టోబర్ మూడవ వారంలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.మరి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి త్వరలోనే నెట్ ఫ్లిక్స్ అధికారక ప్రకటన తెలియజేయునుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube