భారీ ధరలకు చంద్రముఖి 2 ఓటీటీ రైట్స్… స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ అంటే?

డైరెక్టర్ పి.వాసు దర్శకత్వంలో రజనీకాంత్ జ్యోతిక నయనతార వంటి వారు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం చంద్రముఖి( Chandra Mukhi ) ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే.

ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా విడుదలైనటువంటి 17 సంవత్సరాలకు చంద్రముఖి 2( Chandramukhi 2 ) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ విడుదలైనప్పటికీ అనుకున్న స్థాయిలో పెద్దగా ఆదరణ సంపాదించుకోలేకపోయింది.

"""/" / ఈ సీక్వెల్ చిత్రంలో రజనీకాంత్ స్థానంలో నటుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) నటించిన జ్యోతిక స్థానంలో ప్రముఖ నటి కంగనా నటించారు.

ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైనప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైనదని చెప్పాలి.

ఇక ఇప్పటికే థియేటర్లో భారీగా కలెక్షన్స్ పడిపోయాయి.ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్(Net Flix) భారీ ధరలకు కొనుగోలు చేశారని తెలుస్తోంది.

ఏకంగా 8 కోట్ల రూపాయలతో ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారని తెలుస్తోంది.

"""/" / ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు ఈ సినిమాని థియేటర్లలో విడుదలైన నెలన్నర తర్వాత నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయాలని భావించారు అయితే థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ రాకపోవడంతో ముందుగానే ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు.

ఈ క్రమంలోనే అక్టోబర్ మూడవ వారంలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.

మరి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి త్వరలోనే నెట్ ఫ్లిక్స్ అధికారక ప్రకటన తెలియజేయునుంది.

జూనియర్ ఎన్టీఆర్ తెలుగు భాషలో ఉండటం మన అదృష్టం.. జోష్ రవి కామెంట్స్ వైరల్!