వరుసగా పాన్ ఇండియన్ డైరెక్టర్స్ తో మెగాస్టార్ చిరంజీవి సినిమాలు..ఈ వయస్సు లో ఇదేమి కసి సామీ!

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి దిగ్గజాలు ఇండస్ట్రీ లో సూపర్ స్టార్స్ గా చలామణి అవుతున్న రోజుల్లో, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి, వచ్చిన ప్రతీ పాత్ర ని చేస్తూ, అంచలంచలుగా ఎదిగి, ఆ తర్వాత హీరో గా మారి ఇండస్ట్రీ కి మకుటం లేని మహారాజుగా, నాలుగు దశాబ్దాలు నెంబర్ 1 హీరో గా సాగిన స్టార్ మన మెగాస్టార్ చిరంజీవి.మధ్యలో పదేళ్లు రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల ఆయనని మనమంతా బాగా మిస్ అయ్యాము కానీ, రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ సృష్టించిన ప్రభంజనాలు ఎలాంటివో మన కళ్లారా చూసాము.‘ఖైదీ నెంబర్ 150 ‘ చిత్రం తో రికార్డ్స్ ని తిరగరాసి, బాహుబలి సినిమా తర్వాత వంద కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కొల్లగొట్టిన మొట్టమొదటి హీరో గా మెగాస్టార్ చరిత్ర సృష్టించాడు.

 Megastar Chiranjeevi Films With Pan Indian Directors Consecutively Details, Khai-TeluguStop.com
Telugu Khaidi, Chiranjeevi, Ravi Teja, Sukumar, Syeraa, Trivikram-Movie

ఈ చిత్రం తర్వాత ‘సైరా నరసింహా రెడ్డి( Sye Raa Narasimha Reddy )’ లాంటి పీరియడ్ డ్రామా లో ఈ వయస్సు లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా, 140 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను కొల్లగొట్టి తనకి తానే సాటి, ఎవ్వరూ లేరు పోటీ అని అనిపించుకున్నాడు.కానీ ఈ చిత్రం తర్వాత విడుదలైన ‘ఆచార్య‘ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.మెగాస్టార్ నాలుగు దశాబ్దాల కెరీర్ లోనే ఈ చిత్రం ఒక బ్లాక్ మార్కుగా నిల్చింది.

ఈ చిత్రం తర్వాత ఆయన చేసిన ‘గాడ్ ఫాదర్ ‘ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు వచ్చినా కూడా మెగాస్టార్ రేంజ్ లో వసూళ్లను రాబెట్టలేకపోయింది.ఈ రెండు డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత ఈ ఏడాది ప్రారంభం లో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య( Waltair Veerayya )’ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టై మరోసారి 140 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టిన హీరో గా నిలిచాడు మెగాస్టార్.

Telugu Khaidi, Chiranjeevi, Ravi Teja, Sukumar, Syeraa, Trivikram-Movie

అలా కం బ్యాక్ ఇచ్చి అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చిన మెగాస్టార్, రీసెంట్ గా ‘భోళా శంకర్‘ సినిమాతో మరో ఘోరమైన డిజాస్టర్ ని ఇచ్చి అభిమానులను నిరాశ పరిచాడు.ఈ సినిమా ఫ్లాప్ అవ్వడమే మెగాస్టార్ కి మంచిది అయ్యింది అని చెప్పొచ్చు.దీని దెబ్బతో ఆయన రీమేక్ సినిమాలకు స్వస్తి పలికాడు.ఆ తర్వాత ‘భింబిసారా’ డైరెక్టర్ తో ఒక సినిమాని ప్లాన్ చేసాడు.వచ్చే నెల నుండి షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.ఇక ఆ తర్వాత మెగాస్టార్ సెట్ చేసుకున్న లైనప్ చూస్తే మెంటలెక్కిపోతారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram ) దర్శకుడిగా డీవీవీ దానయ్య ఎంటర్టైన్మెంట్స్ లో ఒక సినిమా, అనిల్ రావిపూడి డైరెక్టర్ గా దిల్ రాజు నిర్మాణం లో మరో సినిమా, పుష్ప డైరెక్టర్ సుకుమార్ తో గీత ఆర్ట్స్ బ్యానర్ లో మరో సినిమా ప్లాన్ చేసాడు.ఈ మూడు ప్రాజెక్ట్స్ లో త్రివిక్రమ్ మరియు సుకుమార్ పాన్ ఇండియా లెవెల్ లో పేరున్న డైరెక్టర్లు.

వీరితో మెగాస్టార్ ఎలాంటి అద్భుతాలు సృష్టించబోతున్నాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube