తెలంగాణ తుది ఓటర్ జాబితా ప్రకటనపై సస్పెన్స్ నెలకొంది.షెడ్యూల్ ప్రకారం ఇవాళ తుది ఓటర్ జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించాల్సి ఉంది.
అయితే తెలంగాణలో పర్యటన నిమిత్తం వచ్చిన కేంద్ర ఎన్నికల బృందాన్ని కాంగ్రెస్ కలిసింది.ఈ క్రమంలోనే తుది ఓటర్ జాబితాను ప్రకటించవద్దని కోరిందని తెలుస్తోంది.
ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఇంకా యాభై వేలకు పైగా దరఖాస్తులను పరిశీలించాల్సి ఉందన్న కాంగ్రెస్ తుది ఓటర్ జాబితాను ప్రకటించవద్దని కోరింది.గత నెల 19వ తేదీన ప్రకటించిన జాబితా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 13 లక్షలుగా ఉంది.
కాగా జనవరి నుంచి ఇప్పటివరకు 14 లక్షల 72 వేల మంది కొత్తగా ఓట్లు నమోదు చేసుకున్నారని తెలుస్తోంది.మరోవైపు 3 లక్షల 39 వేల మందిని అధికారులు ఓటర్ల జాబితా నుంచి తొలగించారు.
ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ ఓటర్ తుది జాబితా వెలువడుతుందా? లేదా ? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.