గుంటూరు కారం స్ట్రైక్స్ ఇన్ 100 డేస్.. మాస్ పోస్టర్ వైరల్!

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ఏ సినిమా చేస్తున్న ఆ సినిమాపై ముందు నుండే భారీ స్థాయిలో అంచనాలు నెలకొంటాయి.మరి ఈసారి కూడా అలాగే ఈయన చేస్తున్న సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 100 Days Countdown Begin For Guntur Kaaram's Release, Guntur Kaaram, Mahesh Babu-TeluguStop.com

సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు చేస్తున్న మరో మూవీ ”గుంటూరు కారం” ( Guntur karam )ఈ సినిమాపై ఇప్పటికే బోలెడన్ని హోప్స్ పెరిగి పోయాయి.

భారీ మాస్ యాక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు సగం షూటింగ్ పూర్తి చేసుకుంది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఇక హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.

కాగా ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ అవ్వగా భారీ హైప్ ఏర్పడింది.ఇక ఈ అప్డేట్ తర్వాత ఒకటి అరా పోస్టర్స్ మినహా మరో పెద్ద అప్డేట్ అనేది రాలేదు.ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

ఎప్పటి నుండో ఈ సాంగ్ వస్తుంది అని ఊహాగానాలు వస్తున్నాయి.కానీ మేకర్స్ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి ఒక పోస్టర్ వైరల్ అవుతుంది.ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుండగా ఇప్పటి నుండి కరెక్ట్ గా 100 రోజుల సమయం ఉన్నట్టు ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

గుంటూరు కారం స్ట్రైక్స్ ఇన్ 100 డేస్ పోస్టర్ అందరిని ఆకట్టు కుంటుంది.చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube