జుట్టు ప్రతిరోజు విపరీతంగా ఊడిపోతుందా.? కానీ కొత్త జుట్టు రావడం లేదా.? హెయిర్ గ్రోత్( Hair growth ) లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే కొద్ది రోజుల్లోనే మీ కురులు చాలా పల్చగా మారిపోతాయి.
దాంతో ఎటువంటి హెయిర్ స్టైల్స్ వేసుకోలేరు.పైగా పల్చటి జుట్టు మీ లుక్స్ ను ఘోరంగా పాడు చేస్తుంది.
అందుకే హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నించాలి.అయితే ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ అందుకు అద్భుతంగా సహాయపడుతుంది.
ఈ ఆయిల్ ను వాడితే ఊడిన జుట్టు కూడా మళ్లీ మొలుస్తుంది.మరి ఇంకెందుకు లేటు ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు నువ్వులు, వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు(Flax seeds ), నాలుగు రెబ్బలు ఎండిన కరివేపాకు, నాలుగు లవంగాలు, ఆరు బాదం పప్పులు( Almonds ) వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ కొబ్బరి నూనె ( Coconut oil )పోసుకోవాలి.అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పదార్థాలను కూడా వేసి బాగా కలిపి చిన్న మంటపై ఉడికించాలి.దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఆయిల్ పూర్తిగా చల్లారిన అనంతరం స్ట్రెనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో నింపుకోవాలి.

ఈ ఆయిల్ జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి కాసేపు మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ అప్లై చేసుకున్న మరుసటి రోజు తలస్నానం చేయాలి.
వారానికి కేవలం రెండు సార్లు ఈ ఆయిల్ ను కనుక వాడితే హెయిర్ గ్రోత్ ( Hair growth )చక్కగా ఇంప్రూవ్ అవుతుంది.అదే సమయంలో జుట్టు కుదుళ్లను బలోపేతం చేసే సామర్థ్యం ఈ ఆయిల్ కు ఉంది.
అందువల్ల ఈ ఆయిల్ ను వాడితే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.అలాగే పురుషులు ఈ ఆయిల్ ను వాడితే కనుక బట్టతల వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది.








