కృష్ణాజిల్లా మచిలీపట్నం: పవన్ కు నడుం నొప్పి. జనవాణి నుండి నిష్క్రమణ.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రమైన నడుం నొప్పితో బాధపడుతున్నారు.గత మూడు రోజులుగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో వారాహి యాత్రను పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారు.
మంగళవారం మచిలీపట్నంలో జనవాణిలో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.అయితే బ్యాక్ పెయిన్ కారణంగా పవన్ కళ్యాణ్ కొన్ని అర్జీలను మాత్రమే తీసుకున్నారు.ఇదే విషయాన్ని ఆయన జనవాణిలో చెప్పి మధ్యలో నిష్క్రమించారు.