మరికొద్ది రోజుల్లోనే తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) తమ పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటించబోతోంది.ఐతే ఈ టిక్కెట్లపై సీనియర్ నాయకులు చాలానే ఆశలు పెట్టుకున్నారు.
తమతో పాటు తమ వారసులకు టికెట్ ఇప్పించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.అయితే కాంగ్రెస్ మాత్రం గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని , ఈ విషయంలో ఎటువంటి మొహమాటలకు వెళ్ళకూడదని నిర్ణయించుకుంది.
ఈ మేరకు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కానుగోలు( Sunil Kanugolu ) టీం రంగంలోకి దిగింది.నియోజకవర్గాల వారీగా గెలిచే అవకాశం ఉన్న నాయకులను గుర్తించింది.
పార్టీ సీనియర్ నాయకులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నా, చాలా నియోజకవర్గాల్లో సీనియర్ నాయకులు గెలిచే అవకాశం లేదనే విషయాన్ని సునీల్ కానుగోలు బృందం గుర్తించింది.
ఈ మేరకు సీనియర్ నాయకులు అయినా, కీలక నాయకులైన గెలిచే అవకాశం లేకపోతే పక్కన పెట్టాలని సూచించింది.
ఈ మేరకు సునీల్ కానుగోలు టీమ్ ‘పాపులర్ ‘ సర్వే( Popular Survey ) చేపట్టింది.ఈ సర్వే నివేదిక ఆధారంగానే టికెట్లు కేటాయించాలని కాంగ్రెస్ హై కమాండ్ కూడా నిర్ణయించుకుంది.
ఇక రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ఆధ్వర్యంలో చేపట్టిన మరో సర్వే నివేదికతో సునీల్ రిపోర్టును పోల్చుకుంటూ అభ్యర్థులను ఖరారు చేసే పనులు ఏఐసిసి నిమగ్నమైంది.టికెట్లు ఆశిస్తున్న సీనియర్ల ముందు ఆ నివేదికలకు పెట్టి వారి విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే విషయాన్ని వారి ముందే తేల్చాలని నిర్ణయించుకున్నారట.
నేడు ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగాల్సి ఉండగా, దానిని ఈనెల 6 కి వాయిదా వేశారు.

ఆ కమిటీ సమావేశం తరువాతనే తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.ప్రస్తుతం సునీల్ కానుగోలు టీం చేపడుతున్న పాపులర్ సర్వే నివేదికలు సీనియర్ నాయకుల్లో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి.కచ్చితంగా గెలుస్తారు అనుకున్న వారికి టిక్కెట్ ఇవ్వాలని కాంగ్రెస్ హై కమాండ్ కూడా భావిస్తూ ఉండడంతో, ఎటువంటి సిఫార్సులకు అవకాశం ఉండదని విషయం అర్థం అయింది.
తాజాగా నిర్వహిస్తున్న పాపులర్ సర్వేలో అభ్యర్థులు ఎంపికకు గెలుపే ప్రామాణికం కావడంతో దీంట్లో ఎటువంటి పైరవీలకు అవకాశం లేదనే విషయం అర్థమవుతుంది.టికెట్ల కేటాయింపులో రాజీ పడేది లేదని , సీనియర్లు అయిన జూనియర్లైన గెలుపే ప్రామాణికమని కాంగ్రెస్ తేల్చి చెబుతూ ఉండడంతో, సీనియర్ నాయకుల్లో ఆందోళన మొదలైంది.

సీనియర్లైన , జూనియర్ లైనా విజయవకాశాలు లేవని నివేదికలో తేలితే వారికి టిక్కెట్ ఇచ్చినా ప్రయోజనం ఏముంటుందని, ఓడిపోతున్నట్లు నివేదికల్లో స్పష్టం అవుతున్నా, అటువంటి వారికి టిక్కెట్ ఇస్తే అది ప్రత్యర్థిని గెలిపించినట్లే అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యం అని, టికెట్ దక్కని వారు అసంతృప్తి గురవకుండా, పార్టీ విజయం కోసం కృషి చేస్తే , పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి కీలకమైన పదవులు కట్టబెడతామని ముందుగానే వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది.ప్రస్తుతం సునీల్ కానుగోలు టీం చేస్తున్న సర్వేతో పాటు,

దానికి సంబంధం లేకుండా రాహుల్ గాంధీ గ్రౌండ్ రిపోర్టును తెప్పించుకుంటున్నారు.ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే( Mallikarjuna Kharge ) నేతృత్వంలో పనిచేస్తున్న టీం ఎప్పటికప్పుడు ఈ రిపోర్టును అందిస్తోంది.అభ్యర్థుల ఎంపిక చేసే సమయంలో సునీల్ కానుగోలు సర్వే నివేదికలో ఏ తేడా వచ్చిన రాహుల్ టీం ఇచ్చిన నివేదికతో పోల్చి చూస్తున్నారు .టికెట్ కోసం ఎవరు ఎటువంటి ఫైరవీలు చేయవద్దని, ముందుగానే సూచిస్తున్నారు.ఈ పరిణామాలన్ని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఆందోళన కలిగిస్తున్నాయి.







