భారీ వర్షాలు, వరదలతో అమెరికా ఆర్ధిక రాజధాని న్యూయార్క్( New York ) నగరం అతలాకుతలమవుతోంది.శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని రోడ్లన్నీ చెరువులు, కాలువలను తలపించాయి.
సబ్‌వేలు, ఎయిర్‌పోర్టుల్లోకి వరద నీరు వచ్చి చేరింది.పరిస్ధితి దృష్ట్యా న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ విధించారు గవర్నర్ క్యాథీ హోచుల్ .అలాగే ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్( Eric Adams ) విజ్ఞప్తి చేశారు.లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు.
బ్రూక్లిన్ ప్రాంతంలో( Brooklyn ) అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా.లాగార్జియా, కెన్నెడీ విమానాశ్రయంలోకి వరద నీరు చేరింది.

వర్షం కాస్త తేరిపినివ్వడంతో శనివారం నీటిని బయటకు పంపించడం , ఇంకించే పనులను మొదలుపెట్టారు అధికారులు.శుక్రవారం తాత్కాలికంగా మూసివేయబడిన హైవేలు, రైల్వేలు, విమానాశ్రయాలను తిరిగి తెరిచారు. తుఫాను( Toofan ) కారణంగా బ్రూక్లిన్ పరిసరాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.దీంతో ఓ ఆసుపత్రిలోని 120 మంది రోగులను మరోచోటికి తరలించారు.ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను పర్యవేక్షించే కాన్ ఎడిసన్ సంస్థ మరమ్మత్తు పనులను ప్రారంభించింది.బ్రూక్లిన్‌లోని బెడ్‌ఫోర్డ్ స్టూయ్‌వెసంట్ పరిసరాల్లోని ఆసుపత్రి పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేందుకు చాలా రోజులు పట్టవచ్చని అధికారులు వెల్లడించారు.

బ్రూక్లిన్‌లో కొన్ని ప్రాంతాల్లో 18.41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.ఒక్క గంటలోనే 6 సెంటీమీటర్ల వర్షం పడటంతో వీధుల్లో మోకాలి లోతులో నీరు వచ్చి చేరింది.జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం( John F Kennedy Airport )లో అత్యధికంగా 21.97 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.ఇది 1960లో డోనా హరికేన్ సమయంలో నమోదైన వర్షపాతం రికార్డును అధిగమించిందని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది.
వీకెండ్‌లో భారీ వర్షం పడే అవకాశం వుందని గవర్నర్ క్యాథీ హోచుల్ శనివారం ఉదయం మాన్‌హట్టన్‌లోని రవాణా నియంత్రణ కేంద్రంలో బ్రీఫింగ్ సందర్భంగా చెప్పారు.ముందస్తు చర్యలు, అధికారుల అప్రమత్తత కారణంగా ప్రాణాపాయం తగ్గిందని గవర్నర్ తెలిపారు.
.






