వైరల్ వీడియో: రైలు పట్టాలపై రీల్స్ చేస్తున్నాడు.. ట్రైన్ ఎలా ఢీ కొట్టిందో చూస్తే షాకే...!

సోషల్ మీడియా పిచ్చిలో పడి చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.మరికొందరు ఇతరులను ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతో రిస్కీ స్టంట్స్( Risky Stunts ) చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

 Recording Instagram Reels On Railway Tracks Struck By Moving Train Details, Teen-TeluguStop.com

రైలు పక్కన ఫోటోలు, వీడియోలు దిగుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తే బాగా పాపులర్ కావచ్చనే పిచ్చి ఆలోచనలు చాలామందిలో పెరుగుతున్నాయి.ఇలాంటి ఆలోచనలు వల్ల ఇప్పటికే కొందరు చనిపోయారు.

తాజాగా మరొక బాలుడు అన్యాయంగా చనిపోయాడు.

వివరాల్లోకి వెళితే, ఉత్తర్ ప్రదేశ్ లోని( Uttar Pradesh ) బారాబంకికి చెందిన 14 ఏళ్ల బాలుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తుండగా రైలు ఢీకొని మృతి చెందాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.రైలు ఢీకొట్టడానికి ముందు బాలుడు రైలు పట్టాలపై( Railway Track ) నడుచుకుంటూ వెళ్తున్నట్లు వీడియోలో కనిపించింది.

చనిపోయిన బాలుడి పేరు ఫర్మాన్. అతడిని రైలు ఢీకొన్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

వీడియోలో ఫర్మాన్( Farmaan ) రైల్వే ట్రాక్‌ల వైపు నడుస్తున్నప్పుడు స్నేహితుడు రికార్డ్ చేయడం మనం గమనించవచ్చు.సరిగ్గా అదే సమయంలో పట్టాలపై వేగంగా వస్తున్న రైలు ఫర్మాన్‌ను ఢీకొట్టింది.ఆ వేగానికి బాలుడు గాల్లోకి ఎగిరిపడ్డాడు.ఎముకలు విరిగిపోయి, అంతర్గతంగా తీవ్ర రక్తస్రావమై ఫర్మాన్ అక్కడికక్కడే విలువిల్లాడుతూ ప్రాణాలు విడిచాడు.వీడియోలో అతని స్నేహితుడు షాక్‌కు గురైనట్లు, చిరాకుగా కనిపించాడు.

తేరా దౌలత్‌పూర్‌కు చెందిన ఫర్మాన్ ఇటీవల తన ఇంటికి సమీపంలోని ఊరేగింపుకు స్నేహితులు షుయబ్, నాదిర్, సమీర్‌లతో కలిసి వెళ్లాడని పోలీసులు తెలిపారు.బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడని పేర్కొన్నారు.కుటుంబ సభ్యులకు ఈ విషాద సంఘటన గురించి సమాచారం అందించారు.

అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube